Vivo Y39 5G: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరకే అదిరిపోయే ఫీచర్స్..!

Vivo Y39 5G: వివో తన అద్భుతమైన హ్యాండ్‌సెట్ 'Vivo Y39 5G'ని మలేషియా మార్కెట్లో రహస్యంగా విడుదల చేసింది. ఫోన్ స్లిమ్ డిజైన్‌తో పాటు అనేక ప్రీమియం స్థాయి ఫీచర్‌లతో వస్తుంది.

Update: 2025-02-27 15:00 GMT

Vivo Y39 5G: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరకే అదిరిపోయే ఫీచర్స్..!

Vivo Y39 5G: వివో తన అద్భుతమైన హ్యాండ్‌సెట్ 'Vivo Y39 5G'ని మలేషియా మార్కెట్లో రహస్యంగా విడుదల చేసింది. ఫోన్ స్లిమ్ డిజైన్‌తో పాటు అనేక ప్రీమియం స్థాయి ఫీచర్‌లతో వస్తుంది. ఇందులో పెద్ద బ్యాటరీ నుండి అధునాతన డిస్‌ప్లే వరకు చాలా ఉన్నాయి. ఈ కొత్త హ్యాండ్‌సెట్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y39 5G Features

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1608 x 720 రిజల్యూషన్‌తో 6.68-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ రీఫ్రెష్‌రేట్ స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తుంది. ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఉంది. వాటర్, డస్ట్ నుంచి మొబైల్‌ని ప్రొటక్ట్ చేయడానికి IP64 రేటింగ్ ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 205 గ్రాముల మాత్రమే.

వివో Y39 5జీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అంతే కాకుంకా 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6500mAh కెపాసిటీ బ్యాటరీ అందించారు. ఈ ఫాస్ట్ ఛార్జర్ ఫోన్‌ను కేవలం 83 నిమిషాల్లో 1శాతం నుండి 100శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఫోన్ Funtouch OS 15తో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది.

వివో Y39 5జీ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు f/1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ముందు కెమెరాలో 8 మెగాపిక్సెల్ లెన్స్ ఉంది. ఇతర ఫీచర్స్‌తో వర్చువల్ ర్యామ్ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.1, NFC సపోర్ట్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Vivo Y39 5G Price

వివో Y39 5జీ మలేషియా మార్కెట్లో రెండు ఆకర్షణీయమైన కలర్స్‌లో లాంచ్ అయింది. అందులో ఓషన్ బ్లూ, గెలాక్సీ పర్పుల్ ఉన్నాయి. మలేషియాలో ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌ ఒకే వేరియంట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర $225 (సుమారు రూ. 19,630).

Tags:    

Similar News