Vivo V50 Lite: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కేక పెట్టిస్తున్న ఫీచర్స్.. ధర ఎంతంటే..?
Vivo V50 Lite: Vivo తన కొత్త ఫోన్ Vivo V50 Lite 4Gని టర్కీలో నిశ్శబ్దంగా విడుదల చేసింది.
Vivo V50 Lite: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కేక పెట్టిస్తున్న ఫీచర్స్.. ధర ఎంతంటే..?
Vivo V50 Lite: Vivo తన కొత్త ఫోన్ Vivo V50 Lite 4Gని టర్కీలో నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ గత సంవత్సరం V40 లైట్ 4G నుండి అప్‌గ్రేడ్ చేశారు. వివో ఈ కొత్త ఫోన్ 120Hz రిఫ్రెష్‌రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం 50Mp డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎక్కువ సామర్థ్యం గల 6,500mAh బ్యాటరీ, మన్నికైన బిల్డ్ డిజైన్‌తో వస్తుంది. ఇప్పుడు V50 Lite 4G ధర, ఫీచర్స్ వివరంగా తెలుసుకుందాం.
Vivo V50 Lite 4G Specifications
వివో V50 లైట్ 4జీలో FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే 6.77-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 685 చిప్‌సెట్ ఉంది. 8జీబీ ర్యామ్, 8జీబీ వర్చువల్ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. పవర్ కోసం ఫోన్ 90 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ ఉంది. డ్యూయల్ స్పీకర్లు, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఇందులో చూడచ్చు.
వెనుకవైపు ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, ఆరా లైట్ రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ ఫన్‌టచ్ ఓఎస్ 15 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. బిల్డ్ విషయానికి వస్త IP65-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఛాసిస్‌తో వస్తుంది. అదనంగా డ్రాప్ రెసిస్టెన్స్ కోసం మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H రేటింగ్ ఉంది.
Vivo V50 Lite 4G Price
టర్కీలో Vivo V50 Lite 4G ధర 8GB + 256GB వేరియంట్ TRY 19,999 అంటే సుమారు రూ. 45,110గా ఉంది. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయచ్చు.