Vivo V23 5G: సూర్యకాంతితో రంగులు మారే వివో ఫోన్.. భారత మార్కెట్‌లోకి విడుదల.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే?

Vivo తన కొత్త సిరీస్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. Vivo V23 5G సిరీస్‌ పేరుతో భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.

Update: 2022-01-06 06:17 GMT

Vivo V23 5G: సూర్యకాంతితో రంగులు మారే వివో ఫోన్.. భారత మార్కెట్‌లోకి విడుదల.. ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే?

Vivo తన కొత్త సిరీస్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. Vivo V23 5G సిరీస్‌ పేరుతో భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. Vivo V23 Pro 5G ఫోన్‌లో ఓ ప్రత్యేకతతో విడుదల అయింది. ఈ స్మార్ట్ ఫోన్ తనంతట తానే స్వయంగా రంగులు మారుతుండడం విశేషం. రెండు స్మార్ట్‌ఫోన్‌ల వెనుక భాగంలో ఫ్లోరైట్ AG గ్లాస్ బ్యాక్ అందుబాటులో ఉంది. సూర్యకాంతిలో UV కిరణాల కారణంగా దాని రంగు మారుతుందని కంపెనీ పేర్కొంది. Vivo V23 5G సిరీస్‌లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా అందించారు. ఇది 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. Vivo V23 Pro 5G అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది.

Vivo V23 Pro 5G ధర..

Vivo V23 5G ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో ఉన్న ఫోన్ ధర రూ. 29,990కాగా, 12GB RAM, 256GB స్టోరేజ్ రూ. 34,990గా ఉంది. అలాగే Vivo V23 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులో 8GB RAM, 128GB స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,990కాగా, 12GB RAM, 256GB స్టోరేజ్ ధర రూ.43,990గా లభించనుంది. రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నాయి. ప్రీ-బుకింగ్ కూడా మొదలైంది. Vivo V23 Pro 5G జనవరి 19 నుంచి అందుబాటులోకి రానుండగా, Vivo V23 5G జనవరి 13 నుంచి అందుబాటులోకి వస్తుంది.

Vivo V23 Pro 5G స్పెసిఫికేషన్‌లు..

Vivo V23 Pro 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తోపాటు 6.56-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇవే కాకుండా, ఫోన్ 4GB ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో రానుంది. LPDDR4X RAM, MediaTek డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌తో 256GB UFS 3.1 స్టోరేజీని అందిస్తుంది. ఇది Android 12 ఆధారిత Funtouch OS ను కలిగి ఉంది. ఫోన్ బాడీ గాజుతో తయారు చేశారు. ఫ్రేమ్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఫోన్‌ను సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ కలర్‌లో లభించనుంది.

Vivo V23 Pro 5G కెమెరా కెమెరా గురించి మాట్లాడితే, Vivo V23 Pro 5Gలో వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. దీనిలో ప్రాథమిక లెన్స్ 108 మెగాపిక్సెల్‌ కగా, ఇది ఎపర్చరు f / 1.88 కలిగి ఉంది. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రోగా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో రెండు కెమెరాలు ఉన్నాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్‌తో, మరొకటి 8 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్‌తో అందించారు. ఫ్రంట్ కెమెరాతో 20కి పైగా పోర్ట్రెయిట్ ఎఫెక్ట్స్, డ్యూయల్ టోన్ స్పాట్‌లైట్, 4కే సెల్ఫీ, హెచ్‌డిఆర్ సెల్ఫీ, డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో, వెనుక కెమెరాతో సూపర్ నైట్ వీడియో, డ్యూయల్ ఎక్స్‌పోజర్, 4K వీడియో వంటి మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ముందు కెమెరాతో డ్యూయల్ ఫ్లాష్ లైట్ అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ 30 నిమిషాల్లో 68శాతం ఛార్జ్..

కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 4G, 5G, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 4300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని సహాయంతో, 30 నిమిషాల్లోనే ఫోన్ 68శాతం ఛార్జ్ అవుతుంది. ఇక ఫోన్ బరువు విషయానికి వస్తే 171 గ్రాములుగా ఉంది.

Tags:    

Similar News