TVS : యమహా, హీరోలకు షాక్.. టీవీఎస్ నుంచి 150సీసీ స్కూటర్ వస్తోంది
TVS : యమహా, హీరోలకు షాక్.. టీవీఎస్ నుంచి 150సీసీ స్కూటర్ వస్తోంది
TVS : యమహా, హీరోలకు షాక్.. టీవీఎస్ నుంచి 150సీసీ స్కూటర్ వస్తోంది
TVS : టీవీఎస్ మోటార్స్ కొత్త స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 150ని సెప్టెంబర్ 1న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది 150సీసీ స్కూటర్ విభాగంలో టీవీఎస్ బ్రాండ్ పరిధిని మరింత పెంచుతుంది. 2018లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి టీవీఎస్ ఎన్‌టార్క్ 125సీసీ సెగ్మెంట్‌లో అద్భుతమైన అమ్మకాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు 150సీసీ సెగ్మెంట్‌లోకి టీవీఎస్ ప్రవేశించడంతో స్కూటర్ మార్కెట్‌లో భారీ మార్పులు రానున్నాయి.
టీవీఎస్ ఎన్‌టార్క్ 150 స్కూటర్ పాత డిజైన్‌కు ఆధునిక హంగులతో వస్తోంది. ఇందులో షార్ప్ లైన్స్, సరికొత్త ముందు భాగం, క్వాడ్-ప్రొజెక్టర్స్‌తో కూడిన ఎల్‌ఈడీ లైటింగ్, టీ-ఆకారపు డీఆర్ఎల్స్ స్కూటర్‌కు మరింత ఆకర్షణను ఇస్తున్నాయి. స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియకపోయినా, ఇది 150సీసీ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ సుమారు 12bhp పవర్ ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ స్కూటర్ యమహా ఏరోక్స్ 155, ఏప్రిలియా ఎస్ఆర్ 160, హీరో జూమ్ 160 వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇస్తుంది.
టీవీఎస్ ఈ కొత్త స్కూటర్‌లో అనేక ఫీచర్లను అందించే అవకాశం ఉంది. పెద్ద 14-అంగుళాల వీల్స్, వెనుక డిస్క్ బ్రేక్, స్మార్ట్ కనెక్ట్ సిస్టమ్ ఉండవచ్చు. ఈ సిస్టమ్‌లో టీఎఫ్‌టీ స్క్రీన్, కనెక్టెడ్ ఫంక్షన్‌లు, రైడింగ్ మోడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. స్కూటర్ రెండు వైపులా 14-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండటం టీవీఎస్ స్కూటర్‌లలో ఇదే మొదటిసారి కావచ్చు. 2018లో విడుదలైన ప్రస్తుత ఎన్‌టార్క్ 125, గత ఏడేళ్లుగా భారతదేశంలో స్పోర్టీ 125సీసీ స్కూటర్ విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.