iPhone 17e Launch: డైనమిక్ ఐలాండ్, స్టోరేజ్ అప్‌గ్రేడ్.. 'ఐఫోన్ 17ఈ' బడ్జెట్ కింగ్ అవుతుందా?
ప్రముఖ టెక్డిగ్గజం 'యాపిల్' లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.
iPhone 17e Launch: డైనమిక్ ఐలాండ్, స్టోరేజ్ అప్‌గ్రేడ్.. 'ఐఫోన్ 17ఈ' బడ్జెట్ కింగ్ అవుతుందా?
ప్రముఖ టెక్డిగ్గజం 'యాపిల్' లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 'ఐఫోన్ 17ఈ'ను యాపిల్ కంపెనీ త్వరలోనే రిలీజ్ చేయనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌ను కంపెనీ ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐఫోన్లు ధర చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే మధ్యతరగతి వారు కూడా కొనుగోలు చేసేందుకు వీలుగా.. ఐఫోన్ 17ఈ ఫోన్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేస్తోంది. ఇది యాపిల్ నుంచి వచ్చే బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ అని ప్రచారం అవుతుండటంతో టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
నాచ్‌కు గుడ్‌బై.. డైనమిక్ ఐలాండ్‌కు హాయ్:
ఐఫోన్ 17ఈలో ఇకపై పాత నాచ్ ఉండదని లీకులు చెబుతున్నాయి. దాని స్థానంలో డైనమిక్ ఐలాండ్ అందించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రీమియం మోడళ్లకే పరిమితమైన ఈ ఫీచర్.. ఇప్పుడు బడ్జెట్ ఐఫోన్‌లోకి రావడం పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు.
A19 చిప్‌తో మరింత వేగం:
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 17ఈలో కొత్తగా A19 చిప్ ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న A18 చిప్‌తో పోలిస్తే 5–10 శాతం వరకు వేగంగా పనిచేస్తుందని తెలుస్తోంది. డైలీ యూజ్‌తో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్‌లోనూ మెరుగైన అనుభవం అందించే అవకాశం ఉంది.
48MP కెమెరా, స్టోరేజ్‌లో అప్‌గ్రేడ్:
కెమెరా విభాగంలో కూడా ఐఫోన్ 17ఈలో అప్‌గ్రేడ్ ఉండనుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి. అలాగే బేస్ వేరియంట్‌నే 256GB స్టోరేజ్‌తో ఇవ్వొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే.. స్టోరేజ్ విషయంలో యాపిల్ బడ్జెట్ ఫోన్లపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టినట్టే.
6.1 అంగుళాల OLED డిస్‌ప్లే:
డిస్‌ప్లే విషయంలో కూడా ఎలాంటి రాజీ లేకుండా 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను యాపిల్ ఇవ్వనున్నట్లు సమాచారం. బ్రైట్‌నెస్, కలర్ అవుట్‌పుట్ పరంగా ఇది ప్రీమియం ఐఫోన్లకు దగ్గరగా ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బడ్జెట్ కింగ్ అవుతుందా?:
ఐఫోన్ 17ఈ ధర భారత కరెన్సీలో దాదాపు రూ.60,000 వరకు ఉండొచ్చని అంచనా. అమెరిలో 599 డాలర్లు. మొత్తంగా చూస్తే.. ధరలో డైనమిక్ ఐలాండ్, A19 చిప్, 48MP కెమెరా, OLED డిస్‌ప్లే లాంటి ఫీచర్లు వస్ట్.. బడ్జెట్ కింగ్మా ఫోన్ అనే చెప్పాలి. యాపిల్ బడ్జెట్ సెగ్మెంట్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందా? అన్నది లాంచ్ తర్వాతే తేలనుంది. యాపిల్ అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు టెక్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.