Donald Trump: భారత్‌కు ఎసరు పెడుతోన్న డొనాల్డ్ ట్రంప్.. నిరాశ తప్పేలా లేదుగా
యాపిల్ తయారీ కేంద్రాలను భారత్‌కు తరలించే అంశంపై ఆసక్తిగా ఎదురుచూసిన భారతదేశానికి అనుకోని నిరాశ ఎదురైంది.
Donald Trump: భారత్‌కు ఎసరు పెడుతోన్న డొనాల్డ్ ట్రంప్.. నిరాశ తప్పేలా లేదుగా
Donald Trump: యాపిల్ తయారీ కేంద్రాలను భారత్‌కు తరలించే అంశంపై ఆసక్తిగా ఎదురుచూసిన భారతదేశానికి అనుకోని నిరాశ ఎదురైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఇది స్పష్టమైంది. టెక్ దిగ్గజం యాపిల్ CEO టిమ్ కుక్‌తో తనకున్న సాన్నిహిత్యంతో భారత్‌లో ఉత్పత్తిని విస్తరించడాన్ని తాను సమర్థించనని ట్రంప్ తెలిపారు. దీంతో యాపిల్ తన తయారీ సామర్థ్యాన్ని తిరిగి అమెరికాకే కేంద్రీకరించేందుకు ఒప్పుకుందన్నది ట్రంప్ తెలిపారు.
ఈ సంభాషణ ఖతార్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారత్ అమెరికా ఉత్పత్తులపై భారీ దిగుమతి సుంకాలను విధిస్తున్న దేశాల్లో ఒకటిగా ఉందని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా, గతంలో చైనా అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యాపిల్ తన గ్లోబల్ సరఫరా సుంకాలలో మార్పులు తీసుకొచ్చింది.
భారతదేశంలోని ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ లాంటి భాగస్వామంతో ఐఫోన్‌లను అసెంబుల్ చేయించి, వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగింది. జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లలో చాలావరకు భారత్‌లో తయారైనవేనని టిమ్ కుక్ ఇటీవల వెల్లడించారు. కానీ ఇతర ఉత్పత్తులు, ముఖ్యంగా ఐపాడ్స్, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్ వంటివి వియత్నాం నుంచి దిగుమతి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇంతలో ట్రంప్ మరో కీలక వ్యాఖ్య చేశారు. అమెరికా నుండి దిగుమతయ్యే చాలా వస్తువులపై భారత్ జీరో టారిఫ్‌లు ప్రకటించిందని తెలిపారు. ‘‘భారత్ అమెరికాకు ఓ ప్రత్యేక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది, ఇది ప్రధానంగా జీరో టారిఫ్ ఆధారితమే’’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయని, ఈ చర్చలు మంచి దిశగా కొనసాగుతున్నాయని ట్రంప్ ఏప్రిల్ 30న వెల్లడించారు. త్వరలోనే ఓ అగ్రిగ్మెంట్ కుదిరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.