TRAI On Spam Calls: స్పామ్ కాల్స్‌కు చెక్.. ట్రాయ్ రూ. 10 లక్షల ఫైన్

TRAI On Spam Calls: మీకు లోన్ కావాలా? మల్టీ నేషనల్ కంపెనీలు ఏర్పాటయ్యే ప్రాంతంలో ప్లాట్ కావాలా? మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా?

Update: 2025-02-14 05:49 GMT

TRAI On Spam Calls: మీకు లోన్ కావాలా? మల్టీ నేషనల్ కంపెనీలు ఏర్పాటయ్యే ప్రాంతంలో ప్లాట్ కావాలా? మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీ క్రెడిట్ లిమిట్ పెంచాలా? అంటూ ప్రతిరోజూ మనకు ఏదో రకమైన ఫోన్ వచ్చే ఉంటుంది. ఈ ఫోన్లకు ఎలా చెక్ పెట్టాలని బుర్రలు బద్దలు కొట్టుకుంటాం. ఇలాంటి స్పామ్ కాల్స్, మేసేజ్ లకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ నిబంధనలను మరింత కఠినం చేసింది.

స్పామ్ కాల్స్ పై ఫిర్యాదులను టెలికం కంపెనీలు తీసుకోవాలి. ఈ ఫిర్యాదులపై ఐదు రోజుల్లో చర్యలు తీసుకోవాలి. నిర్ణీత గడువులోపుగా చర్యలు తీసుకోకపోతే ఫైన్ విధిస్తారు. తొలిసారి ఈ నియమాలను అమలు చేయని టెలికం కంపెనీకి రెండు లక్షలు, రెండోసారి మళ్లీ అదే తప్పు పునరావృతమైతే 5 లక్షల ఫైన్ విధిస్తారు. ఆ తర్వాత జరిగే ప్రతి ఉల్లంఘనకు 10 లక్షల చొప్పున ఫైన్ విధించాలని ట్రాయ్ ఆదేశించింది.

టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ టీసీసీసీపీఆర్ నిబంధనల మేరకు స్పామ్ కాల్స్ పై ఫిర్యాదులను స్వీకరించాలి. స్పామ్ కాల్స్ లేదా ఫేక్ మేసేజ్‌లను నమ్మి అనేక మంది ఆర్ధికంగా నష్టపోతున్నారు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు,వీడియోలు, బ్యాంకు సమాచారం కూడా అపరిచిత వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది.

కాలర్ ఐడీ స్పామ్ ప్రొటెక్షన్ యాప్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టవచ్చు. లేదా డునాట్ డిస్టర్బ్ యాప్ ను కూడా ఉపయోగించవచ్చు. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొన్న తర్వాత కూడా స్పామ్ కాల్స్ వస్తే సర్వీస్ ప్రొవైర్ కు ఫిర్యాదు చేయవచ్చు.

Tags:    

Similar News