Toshiba QLED TV: తోషిబా నుంచి సరికొత్త QLED స్మార్ట్ టీవీ.. సరసమైన ధరలో సౌండ్‌, ఫీచర్స్‌ అదిరిపోయాయి..!

Toshiba QLED TV: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి సంస్థ తోషిబా సరికొత్తగా C450ME QLED TVని ప్రారంభించింది.

Update: 2024-05-10 04:30 GMT

Toshiba QLED TV: తోషిబా నుంచి సరికొత్త QLED స్మార్ట్ టీవీ.. సరసమైన ధరలో సౌండ్‌, ఫీచర్స్‌ అదిరిపోయాయి..!

Toshiba QLED TV: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి సంస్థ తోషిబా సరికొత్తగా C450ME QLED TVని ప్రారంభించింది. ఈ జపనీస్ బ్రాండ్ కొత్త టీవీ మోడల్ రెగ్జా ఇంజిన్ ZRతో వస్తోంది. ఇది మెరుగై న సౌండ్ కోసం రెగ్జా పవర్ ఆడియో ఫీచర్ తో వస్తుంది. C450ME అల్ట్రా-సన్నని బెజెల్‌ను కలిగి ఉండి స్లిమ్‌గా ఉంటుంది. ఈ కొత్త QLED TV సిరీస్ ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.26,999. ఈ టీవీ మూడు వేర్వేరు స్క్రీన్ సైజుల్లో వస్తుంది. లాంచ్ ఆఫర్‌గా, 55-అంగుళాల 55C450ME మోడల్ కేవలం రూ.37,999కి, 50-అంగుళా ల 50C450ME మోడల్ కేవలం రూ.32,999కి, 43-అంగుళాల 43C450ME మోడల్ కేవలం రూ. 26,999కి అందుబాటులో ఉంది.

మీరు ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ నుంచి కొనుగోలు చేస్తే కంపెనీ ప్రత్యేక ఆఫర్లను అంది స్తోంది. ఈ టీవీని మే 7 నుంచి 31 మధ్య ఏదైనా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుంచి కొనుగోలు చేస్తే మీరు 1 సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం మెంబర్‌షిప్ (విలువ ₹ 1499), జియో సినిమా ఫ్యామిలీ ప్రీమియం మెంబర్‌షిప్ (విలువ ₹ 1788) పొందుతారు.

తోషిబా QLED టీవీ స్పెక్స్

Regza Engine ZR టెక్నాలజీ సాయంతో ఈ కొత్త టీవీ 4K రిజల్యూషన్‌ను ఉపయోగించుకోగలదు. అలాగే క్వాంటమ్ డాట్ కలర్ టెక్నాలజీతో మెరుగైన రంగులు, ప్రకాశవంతమైన చిత్ర అనుభవా న్ని అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, హెచ్‌డిఆర్ 10+కి సపోర్ట్ చేస్తుంది. ఇది ముదురు నలుపు నుంచి ప్రకాశవంతమైన తెలుపు వరకు రంగులను ప్రదర్శించడానికి. అద్భుతమైన ధ్వని కోసం REGZA పవర్ ఆడియో, డాల్బీ ఆడియో, డాల్బీ అట్మోస్, DTSX వంటి టెక్నాలజీ కలిగి ఉంది.

ఈ టీవీలోవాయిస్ అసిస్టెంట్ ఉంది. తద్వారా మీరు టీవీని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. మీరు Alexa, VIDAA వాయిస్ వంటి వాయిస్ అసిస్టెంట్ల సాయంతో TVకి ఆదేశాలను ఇవ్వవచ్చు. VIDAA ఆపరేటింగ్ సిస్టమ్ అనేక ప్రసిద్ధ OTT యాప్‌లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ టీవీలో HDMI, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ, USB మీడియా ప్లేయర్ ఆప్షన్‌ అందిస్తుంది.

Tags:    

Similar News