iPhone 16 Pro Price Drop: ఇంతకంటే చీప్‌గా ఐఫోన్ మీకు దొరకదు.. బంపర్ ఆఫర్..!
iPhone 16 Pro Price Drop: యాపిల్ ఐఫోన్‌ను ఒక స్టేటస్ బ్రాండ్ లాగా చూస్తారు అందరూ.
iPhone 16 Pro Price Drop: యాపిల్ ఐఫోన్‌ను ఒక స్టేటస్ బ్రాండ్ లాగా చూస్తారు అందరూ. ఐఫోన్‌ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఐఫోన్‌ని చేతిలో పట్టుకొని అద్దం ముందర ఫోటో తీసుకోవడం సోషల్ మీడియాలో ఎప్పటినుంచో సాగుతున్న ట్రెండ్. అందుకే ఈ ఫోన్ అంటే అందరికీ విపరీతమైన క్రేజ్. ఇక ఇలాంటి ఐఫోన్‌పై ఆఫర్లు వచ్చాయంటే చాలు.. ఆ ఆఫర్ గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు మొబైల్ లవర్స్.
ఇప్పుడు ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ప్రోపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌ని కంపెనీ కొన్ని నెలల క్రితం రూ. 1,19,000 ధరతో విడుదల చేసింది. ఆఫర్లపై ఈ మొబైల్‌ను రూ.1 లక్ష లోపు మీ సొంతం చేసుకోవచ్చు. అంటే నేరుగా రూ.20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్‌ని ఒకసారి చూద్దాం.
iPhone 16 Pro Offers
యాపిల్ iPhone 16 Proని రూ. 1,19,000 ధరతో విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న 9శాతం తగ్గింపు తర్వాత ధర రూ. 1,09,500గా ఉంది. అంటే మీరు iPhone 16 Proపై రూ. 10,400 ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ధరను మరింత తగ్గించడానికి కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను కూడా ఉన్నాయి. మీరు ICICI బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే రూ. 3,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఫోన్ ధర రూ.1,06,500కి తగ్గుతుంది. అయితే మీకు IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే EMI ఎంపికతో రూ. 10,000 అదనపు తగ్గింపు ఇస్తున్నారు. ఈ కారణంగా ఫోన్ ధర రూ. 99,500కి చేరుతుంది.
iPhone 16 Pro Specifications
ఈ ఫోన్‌లో డాల్బీ విజన్ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫోన్‌ని ప్రీమియం గ్రేడ్ 5 టైటానియం ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఐఫోన్ 16 ప్రో ఇంటర్నల్ A18 ప్రో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. పవర్ కోసం 3,367mAh బ్యాటరీ అందించారు. కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ 16 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌ను అందించే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.