ఇంటర్‌ నెట్‌ యూజర్స్‌కి అలర్ట్‌.. వాటిలో జూమ్‌ యాప్‌ పనిచేయదు..!

ఇంటర్‌ నెట్‌ యూజర్స్‌కి అలర్ట్‌.. వాటిలో జూమ్‌ యాప్‌ పనిచేయదు..!

Update: 2022-06-20 06:30 GMT

ఇంటర్‌ నెట్‌ యూజర్స్‌కి అలర్ట్‌.. వాటిలో జూమ్‌ యాప్‌ పనిచేయదు..!

Zoom App: జూమ్‌ యాప్‌ ఎంత ఫేమస్‌ అయిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా కరోనా కాలంలో దీనిని విపరీతంగా వాడారు. విద్యార్థుల నుంచి కార్పొరేట్‌ అధికారుల వరకు అందరు వినియోగించారు. జూమ్‌ యాప్‌ ద్వారా మీటింగ్స్‌ ఎక్కువగా కండక్ట్‌ చేశారు. ఒకేసారి చాలామంది మాట్లాడటానికి అవకాశం ఉండటం వల్ల కరోనా కాలంలో చాలామంది ఉపయోగించారు. అయితే తాజాగా జూమ్‌యాప్‌ కొన్నింటిలో పనిచేయదని కంపెనీ వెల్లడించింది.

ఆండ్రాయిడ్, IOS, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ ఇలా ప్రపంచవ్యాప్తంగా రకరకాల డివైజ్‌ల యూజర్లు దీనిని వాడుతున్నారు. అయితే ఈ ఆగస్ట్, 2022 నుంచి క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో మాత్రం Zoom App అఫీషియల్ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు తాజాగా కంపెనీ వెల్లడించింది. Zoom App వాడే యూజర్లకు ఒక నోటిఫికేషన్ ప్రస్తుతం అందుతోంది.దీని అర్థం క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో జూమ్ యాప్ సేవలు ఆగస్టు నుంచి నిలిచిపోయినా, వీడియో కాల్స్ కోసం జూమ్ ఫర్ క్రోమ్‌ PWA అనే జూమ్ వెబ్ యాప్‌ను యూజర్లు వినియోగించుకోవచ్చు.

హై కోర్ ల్యాప్‌ ట్యాప్స్‌ కన్నా గూగుల్‌ క్రోమ్‌బుక్స్‌(ల్యాప్‌ ట్యాప్‌ తరహాలో) లిమిటెడ్‌ సపోర్ట్‌తో పని చేస్తాయి. వీటిలో విండోస్‌ సపోర్ట్‌ చేయదు. గూగుల్‌ ప్రత్యేకంగా తయారు చేసిన Chrome OSతో మాత్రమే ఇవి పని చేస్తాయి. వీటిలో సాధరణ ల్యాప్ టాప్స్ మాదిరి అన్ని యాప్‌ల సేవలను ఉపయోగించుకోవడం కుదరదు. నిలుపుదలకు సంబంధించి ఇప్పటికే Chromebook వినియోగదారులకు నోటిఫికేషన్‌లు పంపబడుతున్నాయి.

Tags:    

Similar News