Impact of AI on Jobs: ఎవరు చెప్పారు ఏఐ తో ఉద్యోగాలు పోతాయని.. కావాలంటే ఈ సర్వే లెక్కలు చూడండి!

Impact of AI on Jobs: ఏఐ వస్తే మనుషుల అవసరం ఉండదని, లక్షలాది ఉద్యోగాలు గాలిలో కలిసిపోతాయని సామాన్యుడి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు అందరిలోనూ ఒక రకమైన ఆందోళన నెలకొంది.

Update: 2026-02-20 03:26 GMT

 Impact of AI on Jobs: ఎవరు చెప్పారు ఏఐ తో ఉద్యోగాలు పోతాయని.. కావాలంటే ఈ సర్వే లెక్కలు చూడండి!

Impact of AI on Jobs: నేటి టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. ఏఐ వస్తే మనుషుల అవసరం ఉండదని, లక్షలాది ఉద్యోగాలు గాలిలో కలిసిపోతాయని సామాన్యుడి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వరకు అందరిలోనూ ఒక రకమైన ఆందోళన నెలకొంది. అయితే, ఈ భయాల్లో వాస్తవం లేదని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (NBER) నిర్వహించిన తాజా సర్వే బాంబు పేల్చింది.

అమెరికా, యూకే, జర్మనీ వంటి అగ్ర దేశాల్లోని 6000 మంది ఎగ్జిక్యూటివ్‌లపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయన్నది కేవలం ప్రచారం మాత్రమే. సర్వేలో పాల్గొన్న 90 శాతం కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యలో ఎలాంటి మార్పు రాలేదని కుండబద్దలు కొట్టాయి.

2025లో ప్రపంచవ్యాప్త వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో దాదాపు 61 శాతం ($258.7 బిలియన్లు) ఏఐ స్టార్టప్‌లకే వెళ్లాయి. ఇంత భారీ స్థాయిలో డబ్బు కుమ్మరిస్తున్నా, ఆశించిన స్థాయిలో ఉత్పాదకత పెరగడం లేదని 80 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కంపెనీలను నడిపే బాసుల్లో కేవలం మూడింట ఒక వంతు మంది మాత్రమే ఏఐని వాడుతున్నారు. వారు కూడా వారానికి కేవలం 90 నిమిషాలు మాత్రమే దీనిని ఉపయోగిస్తుండటం గమనార్హం.

1970-80ల కాలంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీనిని ఆర్థికవేత్తలు 'సోలో ఉత్పాదకత పారడాక్స్' అంటారు. అప్పట్లో కంప్యూటర్ల వల్ల పని సులభం కాకపోగా, పనిభారం పెరిగి ఉత్పాదకత తగ్గింది. మళ్ళీ దశాబ్దం తర్వాత కానీ ఫలితాలు కనిపించలేదు. ఇప్పుడు ఏఐ విషయంలోనూ అదే 'వెయిటింగ్ పీరియడ్' నడుస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాబోయే మూడేళ్లలో ఏఐ వల్ల ఉత్పాదకత 1.4 శాతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యోగాల్లో వచ్చే కోత కేవలం 0.7 శాతం మాత్రమే ఉంటుందని అంచనా. అంటే, ఏఐ మనిషిని భర్తీ చేయడం లేదు, మనిషి చేసే పనిని మరింత సమర్థవంతంగా మార్చడానికి సిద్ధమవుతోంది.

Tags:    

Similar News