Tecno Pova Curve 5G India: పోవా చంపేశారు మావా.. AI ఫీచర్స్‌తో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. సూపర్‌గా ఉంది..!

Tecno Pova Curve 5G India: టెక్నో తన కొత్త బడ్జెట్ ఫోన్ టెక్నో పోవా కర్వ్ 5Gని త్వరలో భారతదేశంలో విడుదల చేయబోతోంది.

Update: 2025-05-23 15:00 GMT

Tecno Pova Curve 5G India: పోవా చంపేశారు మావా.. AI ఫీచర్స్‌తో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. సూపర్‌గా ఉంది..!

Tecno Pova Curve 5G India: టెక్నో తన కొత్త బడ్జెట్ ఫోన్ టెక్నో పోవా కర్వ్ 5Gని త్వరలో భారతదేశంలో విడుదల చేయబోతోంది. లాంచ్‌కి ముందు, కంపెనీ దాని డిజైన్ గురించి సమాచారాన్ని అందించే టీజర్‌లను సోషల్ మీడియాలో పంచుకుంది. దీని ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్స్‌లో వస్తుంది. దీనిలో కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. దీనితో పాటు, ఇది అనేక AI- ఆధారిత ఫీచర్స్ ఉంటాయి. ఈ టెక్నో ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌కి వస్తుంది. డిజైన్ పరంగా, పోవా కర్వ్ 5G వెనుక భాగంలో త్రిభుజాకార ఆకారపు కెమెరా మాడ్యూల్ ఉంటుంది. అలానే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Tecno Pova Curve 5G Launch Date

టెక్నో పోవా కర్వ్ 5G భారతదేశంలో మే 29న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఇది కొత్త బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో వస్తుంది. ఇది స్టార్‌షిప్ ఏరోడైనమిక్ రూపం నుండి ప్రేరణ పొందింది. ఇది కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, శక్తివంతమైన 5G కనెక్టివిటీతో పాటు స్మార్ట్ AI- ఆధారిత ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో టెక్నో ఇన్-హౌస్ వాయిస్ అసిస్టెంట్ ఎల్లా కూడా ఉంటుంది. AI ప్రైవసీ బ్లరింగ్,సర్కిల్ టు సెర్చ్ వంటి కొన్ని గొప్ప AI ఫీచర్‌లతో వస్తుంది.

Tecno Pova Curve 5G Features

టెక్నో ఇండియా X లో అధికారిక చిత్రాలను పోస్ట్ చేసింది, టెక్నో పోవా కర్వ్ 5G ని బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో చూపిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక ల్యాండింగ్ పేజీని కూడా సృష్టించింది, ఇది ఫోన్ లాంచ్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇది డ్యూయల్ కెమెరా సెన్సార్లు, LED ఫ్లాష్‌ ఉంటుంది.

టెక్నో పోవా కర్వ్ 5G డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్ ఉంటుంది, దీనిలో సెల్ఫీ కెమెరా ఉంది. హ్యాండ్‌సెట్ వైపు ఆరెంజ్ కలర్ బటన్ ఉంది, ఇది పవర్ బటన్‌గా పనిచేస్తుంది. దీనికి కెమెరా మాడ్యూల్ కింద ఆరెజ్ కలర్ స్ట్రిప్ కూడా ఉంది. ఇది మెరుగైన నెట్‌వర్క్ కవరేజ్ కోసం ఇంటెలిజెంట్ సిగ్నల్ హబ్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరుస్తుంది.

టెక్నో పోవా కర్వ్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు, ఇది మిడ్-రేంజ్ 5G ప్రాసెసర్ ,మెరుగైన పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది, ఇది వినియోగదారులకు తాజా ఫీచర్లు, భద్రతా అప్‌డేట్లను అందిస్తుంది. స్టోరేజ్, ర్యామ్ ఎంపికల గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ మూడు వేరియంట్లలో రావచ్చు - 6GB RAM + 128GB, 8GB RAM + 128GB, 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి.

Tags:    

Similar News