Sony Xperia 1 VII Smartphone Launched: గ్రాండ్‌గా ఎంట్రీ.. మార్కెట్‌లోకి సోనీ ఎక్స్‌పీరియా కొత్త స్మార్ట్‌ఫోన్.. సిద్ధంగా ఉండండి బ్రో..!
Sony Xperia 1 VII Smartphone Launched: జపనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.
Sony Xperia 1 VII Smartphone Launched: గ్రాండ్‌గా ఎంట్రీ.. మార్కెట్‌లోకి సోనీ ఎక్స్‌పీరియా కొత్త స్మార్ట్‌ఫోన్.. సిద్ధంగా ఉండండి బ్రో..!
Sony Xperia 1 VII Smartphone Launched: జపనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా 1 VII ని వచ్చే వారం విడుదల చేయవచ్చు. ఈ ఫోన్ కంపెనీ ఎక్స్‌పీరియా 1 VI సక్సెసర్‌గా తీసుకొస్తుంది. ఇటీవల విడుదలైన ఈ ఫోన్ తాజా లీకైన ఫోటోల ప్రకారం, కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పాత దాని మాదిరిగానే డిజైన్‌తో రావచ్చు, దీనిలో మూడు ఎంపికలు కనిపిస్తాయి.ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ అగ్రశ్రేణి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 12జీబీ వరకు ర్యామ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు వెల్లడైన ఈ తాజా స్మార్ట్‌ఫోన్ వివరాల గురించి తెలుసకుందాం.
Sony Xperia 1 VII Design And Color Options
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ షేర్ చేసిన లీకైన చిత్రం ప్రకారం.. సోనీ ఎక్స్‌పీరియా 1 VIIని బ్లాక్, గ్రీన్, పర్పుల్ అనే మూడు కలర్స్‌లో లాంచ్ చేయవచ్చు. డిజైన్ పరంగా, లీకైన చిత్రాలు సోనీ ఎక్స్‌పీరియా 1 VII లో పెద్దగా మార్పులు లేవని సూచిస్తున్నాయి. ఇందులో పొడవైన డిస్‌ప్లే ఉంటుంది, సెల్ఫీ కెమెరాను టాప్ బెజెల్‌లో ఉంచుతారు. వెనుక భాగంలో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
నివేదిక ప్రకారం, నిలువు కెమెరా మాడ్యూల్ అల్ట్రావైడ్, మెయిన్ కెమెరాలను కలిగి ఉంటుంది, తరువాత డ్యూయల్ ఫ్లాష్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ (ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్‌గా కూడా పనిచేస్తుంది) కుడి వైపున ఉన్నాయి.
Sony Xperia 1 VII Battery
లీకైన మార్కెటింగ్ వివరాలు కూడా Xperia 1 VII సోనీ బ్రావియా టెక్నాలజీతో కూడిన డిస్‌ప్లే, కొత్త సన్‌లైట్ మోడ్‌ను కలిగి ఉంటుందని వెల్లడిస్తోంది. స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది రెండు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని పేర్కొంది. పాత నివేదికల ప్రకారం, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ SoC, 12జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. సోనీ ఈ ఫోన్‌ని మే 13 న అంటే ఈరోజు జరిగే లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరిస్తుంది.