Refrigerator: ఫ్రిజ్‌తో జర జాగ్రత్త.. చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణం..!

Refrigerator: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌ ఉంటుంది. దీనిని జాగ్రత్తగా ఉపయోగిస్తే ఏం పర్వాలేదు కానీ తేడా వస్తే పేలిపోయే ప్రమాదం ఉంటుంది.

Update: 2023-05-29 15:30 GMT

Refrigerator: ఫ్రిజ్‌తో జర జాగ్రత్త.. చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణం..!

Refrigerator: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌ ఉంటుంది. దీనిని జాగ్రత్తగా ఉపయోగిస్తే ఏం పర్వాలేదు కానీ తేడా వస్తే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో ఫ్రిజ్‌ ఉన్నప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అది ఒక పెద్ద బాంబులా తయారవుతుంది. రిఫ్రిజిరేటర్‌ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణమవుతుంది. దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు తెలుసుకుందాం.

1. విద్యుత్ హెచ్చుతగ్గులు ఉన్న ప్రదేశంలో రిఫ్రిజిరేటర్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. దీనివల్ల రిఫ్రిజిరేటర్ కంప్రెసర్పై ఒత్తిడి పెరుగుతుంది. పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది.

2. ఫ్రిజ్‌లో మంచు గడ్డకట్టడం ప్రారంభమైనప్పుడు కొద్దిసేపటికి దాని ఓపెన్ చేయాలి. దీనివల్ల గడ్డకట్టే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అప్పుడప్పుడు కొంత ఉష్ణోగ్రత పెంచే విధంగా చేయాలి. దీనివల్ల ఫ్రిజ్‌ మంచి కండిషన్‌లో ఉంటుంది.

3. రిఫ్రిజిరేటర్‌ కంప్రెసర్ భాగంలో ఏదైనా లోపం ఉంటే దానిని కంపెనీ సర్వీస్ సెంటర్‌కు తరలించాలి. ఎందుకంటే స్థానిక భాగాలను ఉపయోగిస్తే అది కంప్రెసర్‌లో పేలుడుకు కారణం అవుతుందని గుర్తుంచుకోండి.

4. కొన్ని గంటల తరబడి రిఫ్రిజిరేటర్‌ నిరంతరంగా నడుస్తుంటే దానిని తెరవడానికి ముందు ఒక్కసారి పవర్ ఆఫ్ చేయాలని గుర్తుంచుకోండి. తర్వాత అంతా బాగానే ఉంటే స్విచ్‌ ఆన్‌ చేస్తే సరిపోతుంది.

5. రిఫ్రిజిరేటర్‌ ఉపయోగిస్తున్నప్పుడు దాని ఉష్ణోగ్రతను ఎప్పుడూ కనిష్ట స్థాయికి తీసుకురావద్దు. ఎందుకంటే ఇది కంప్రెసర్‌పై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల బ్లాస్ట్‌ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News