iQOO Z10x: ఐక్యూ నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే
iQOO Z10x: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ త్వరలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'iQOO Z10x'ని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్‌లో కనిపించింది.
iQOO Z10x: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూ త్వరలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'iQOO Z10x'ని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్‌లో కనిపించింది. అంతేకాకుండా, ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ కొన్ని స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఫోన్‌లో ఎక్కువ సామర్థ్యం ఉండే బ్యాటరీ ఉండొచ్చు. ఈ కొత్త ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఐక్యూ Z10x మోడల్ నంబర్ I2404తో BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్‌లో గుర్తించారు. కానీ, ఈ జాబితా నుండి ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్, లాంచ్ తేదీ బయటకు రాలేదు. అయితే ఐక్యూ ఈ ఫోన్‌ను త్వరలో దేశంలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ కంపెనీ మునుపటి ఫోన్ iQOO Z9xకి సక్సెసర్‌గా తీసుకొస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2024 మధ్యలో విడుదలైంది. Z9xని పెద్ద బ్యాటరీ బ్యాకప్, పవర్‌ఫుల్ ప్రాసెసర్ కారణంగా మొబైల్ లవర్స్ ఫేవరేట్‌గా మారింది. ఈ ఫోన్ సక్సెసర్‌గా వస్తున్న Z10xలో కొన్ని అప్‌డేటెడ్ ఫీచర్లు ఉండొచ్చని భావిస్తున్నారు.
iQOO Z10x ఫీచర్స్
ఇంటర్నెట్లో లీకైన సమాచారం ప్రకారం.. ఐక్యూ Z10xలో 7,000mAh తో ఎక్కువ సామర్థ్యం ఉండే బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.72-అంగుళాల IPS LCD ప్యానెల్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటాయి. అలానే 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి లేదా మార్చిలో లాంచ్ కావచ్చని అంటున్నారు. ఇటీవల ఈ ఫోన్ GSMA డేటాబేస్‌లో కూడా లిస్ట్ అయింది. డేటా బేస్ ఆధారంగా ఫోన్ గ్లోబల్ మార్కెట్లో కూడా లాంచ్ అవుతుంది.