Mobile App for Health Tests: ఈ మొబైల్ యాప్‌తో మీ ఫేస్ స్కాన్ చేస్తే 25 రకాల టెస్టుల రిజల్ట్స్

Update: 2024-12-21 13:18 GMT

Ciana Health Mobile App for Health Tests: చాలా రకాల ఆరోగ్య సమస్యలకు టెస్టులు చేయించుకోవడం కోసం డయాగ్నస్టిక్స్‌కు పరుగులు తీస్తుంటారు. కానీ ఇకపై మీరు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం డయాగ్నస్టిక్స్ సెంటర్స్ వద్దకు పరుగెత్తాల్సిన అవసరం లేదంటోంది ఏసియానా అనే ఒక స్టార్టప్ కంపెనీ. మీ ఇంట్లో కాలు కదపకుండా సోఫాలో కూర్చొనే జస్ట్ మీ మొబైల్ నుండే ఫేస్ స్కాన్ చేస్తే చాలు... మీ బేసిక్ హెల్త్ ప్రొఫైల్ రిపోర్ట్ వచ్చేస్తుందని ఆ కంపెనీ చెబుతోంది. అవును... మీరు విన్నది నిజమే. తాము డెవలప్ చేసిన "సియానా హెల్త్" అనే మొబైల్ యాప్‌‌తో మీ ఫేస్ స్కాన్ చేస్తే 25 రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన ఫలితాలు పొందొచ్చంటోంది.

Full View

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఈ స్టార్టప్ కంపెనీ వైద్య పరీక్షల్లో కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులేస్తోంది. అందులో భాగంగానే ఈ సియానా హెల్త్ అనే మొబైల్ యాప్ డెవలప్ చేశామంటోంది. ఈ యాప్‌తో మీ ఫేస్‌ను 30 సెకన్ల పాటు స్కాన్ చేయడం ద్వారా మీ బాడీ మాస్ ఇండెక్స్, గుండె సంబంధిత జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, బీపీ, బాడీ టెంపరేచర్, పల్స్ రేట్, హైపర్‌టెన్షన్ రిస్క్, కార్డియాక్ వర్క్‌లోడ్ రిస్క్ వంటి 25 రకాల టెస్టుల రిజల్ట్స్ తెలుసుకోవచ్చని ఆ కంపెనీ ప్రకటించింది.

కెనడాకు చెందిన కంపెనీ నుండి తాము ఈ బిజినెస్ లైసెన్స్ తీసుకున్నామని ఎసియానా సంస్థ చెప్పింది. అయితే, ఈ ఫలితాలను సూచనలుగా తీసుకోవచ్చు కానీ డాక్టర్స్ మెడిసిన్ రాసే ప్రిస్క్రిప్షన్ కోసం ఉపయోగించలేరని ఆ సంస్థలో బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ హెల్త్ టెక్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గీతికా సాయి నూతక్కి చెప్పినట్లుగా ది హిందూ బిజినెస్ లైన్ వార్తా కథనం వెల్లడించింది. సియానా యాప్ చెప్పే రిజల్ట్స్ రిస్క్ ప్రొఫైల్‌ను బట్టి డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, యెల్లో, రెడ్ జోన్ కలర్ కేటగిరీల ద్వారా విభజిస్తారు. ఈ ఫేస్ స్కాన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో పనిచేస్తుంది

సియానా యాప్‌పై అనుమానాలు

సియానా యాప్ ద్వారా ఇంట్లోంచి ఎక్కడికీ వెళ్లకుండానే మీకు 25 రకాల టెస్ట్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయని ఏసియానా చెబుతున్నప్పటికీ... దీని పనితీరుపైనా అనుమానాలు వ్యక్తంచేస్తోన్న వాళ్లు లేకపోలేదు. ఫేస్ స్కాన్ చేసేటప్పుడు ఉన్న లైటింగ్, స్కాన్ చేసే మొబైల్ కెమెరా క్వాలిటీ వంటి అంశాల ఆధారంగా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు కదా అనేది కొంతమంది సందేహం. ఈ తరహా సిస్టమ్స్ ఫలితాల్లో కచ్చితత్వం పెరగాలంటే మరిన్ని పరిశోధనలు అవసరం అనేది వారి అభిప్రాయం.

Tags:    

Similar News