Samsung Top 3 Smartphones: బడ్జెట్‌లో ది బెస్ట్.. శాంసంగ్ ఫోన్లు.. తక్కువ ధరకే మీ సొంతం..!
Samsung Top 3 Smartphones: మీరు శాంసంగ్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బడ్జెట్ రూ. 10,000 కంటే తక్కువ ఉంటే.. మేము మీకు మూడు గొప్ప స్మార్ట్‌ఫోన్ల గురించి చెప్పబోతున్నాము.
Samsung Top 3 Smartphones: బడ్జెట్‌లో ది బెస్ట్.. శాంసంగ్ ఫోన్లు.. తక్కువ ధరకే మీ సొంతం..!
Samsung Top 3 Smartphones: మీరు శాంసంగ్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బడ్జెట్ రూ. 10,000 కంటే తక్కువ ఉంటే.. మేము మీకు మూడు గొప్ప స్మార్ట్‌ఫోన్ల గురించి చెప్పబోతున్నాము. శాంసంగ్ గెలాక్సీ M, F సిరీస్‌లోని ఈ ఫోన్‌ల ధర రూ. 9500 కంటే తక్కువ. మా జాబితాలో అత్యంత చౌకైన ఫోన్ ధర రూ. 6499 మాత్రమే. ఈ ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్ కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ, గొప్ప ప్రాసెసర్‌ను చూస్తారు. కాబట్టి ఈ శాంసంగ్ ఫోన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Samsung Galaxy M05
4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 6499 ధరకు లభిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో HD + రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను పొందుతారు. ఈ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ప్రాసెసర్‌గా ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G85 చిప్‌సెట్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో అందించే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌లు. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్‌లు. ఈ ఫోన్‌లో బ్యాటరీ 5000mAh. ఈ బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడచ్చు.
Samsung Galaxy F06 5G
4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8499. ఫీచర్ల గురించి మాట్లాడితే ఫోన్‌లో 6.7-అంగుళాల HD + డిస్‌ప్లేను పొందుతారు. ప్రాసెసర్‌గా, కంపెనీ ఫోన్‌లో డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌ను పొందుతారు. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5000mAh, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Samsung Galaxy M06 5G
4GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ ధర రూ. 9499. దీనిలో డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను చూడచ్చు. ఫోన్‌లో, కంపెనీ 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh బ్యాటరీతో వచ్చింది. ఈ బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్పాలంటే, ఫోన్ Android 15 ఆధారంగా OneUI 7లో పనిచేస్తుంది.