Samsung Galaxy F06 5G: బడ్జెట్ మార్కెట్‌పై కన్నేసిన సామ్‌సంగ్.. రూ.9,999కే కొత్త 5జీ ఫోన్ లాంచ్..!

Samsung Galaxy F06 5G: సామ్‌సంగ్ తన కొత్త 'ఎఫ్' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 'Samsung Galaxy F06 5G' పేరుతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Update: 2025-02-14 07:34 GMT

Samsung Galaxy F06 5G: బడ్జెట్ మార్కెట్‌పై కన్నేసిన సామ్‌సంగ్.. రూ.9,999కే కొత్త 5జీ ఫోన్ లాంచ్..!

Samsung Galaxy F06 5G: సామ్‌సంగ్ తన కొత్త 'ఎఫ్' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 'Samsung Galaxy F06 5G' పేరుతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ రూ. 10 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంచింది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy F06 5G Price

సామ్‌సంగ్ గెలాక్సీ F06 5జీ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో  అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999 ప్రారంభ ధరతో విడుదల చేశారు. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 11,499తో లాంచ్ చేశారు. అలానే లాంచ్ ఆఫర్ కింద రూ.500 డిస్కౌంట్ ఇస్తుంది. ఈ బడ్జెట్ ఫోన్ బ్లూ, లైట్ వైలెట్ కలర్స్‌లో లభిస్తుంది.

Samsung Galaxy F06 5G Features

సామ్‌సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.74-అంగుళాల HD ప్లస్ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే గరిష్టంగా 900 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ బడ్జెట్‌లో చాలా కంపెనీలు పంచ్ హోల్ డిస్‌ప్లే‌ను అందిస్తున్నాయి. మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో పనిచేస్తుంది.

ఫోన్ భారత్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4GB+ 6GB RAM ఉన్నాయి. ఈ ఫోన్  బేస్ వేరియంట్ 4GB RAM తో వస్తుంది. 4GB RAM మోడల్‌లో 4GB వర్చువల్ RAM, 6GB RAM మోడల్‌లో 6GB వర్చువల్ RAM ఉంది. మరో 128GB స్టోరేజ్ ఆప్షన్ కూడా అందించారు.

 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో LED ఫ్లాష్ లైట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు,వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ F06 5జీ మొబైల్ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో విడుదలైంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే ఈ 25W ఛార్జర్ ఫోన్ బాక్స్‌లో అందుబాటులో లేదు. ఈ మొబైల్‌లో USB టైప్ C పోర్ట్‌ను చూడొచ్చు.

Tags:    

Similar News