సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో నాలుగు బడ్జెట్ ఫోన్లు లాంచ్

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ దేశీయ మార్కెట్లో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ ఫోన్లను కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది

Update: 2025-01-28 15:17 GMT

సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో నాలుగు బడ్జెట్ ఫోన్లు లాంచ్

Samsung Upcoming Budget Phones: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ దేశీయ మార్కెట్లో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ ఫోన్లను కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది. దీనిలో మోడల్ నంబర్‌తో పాటు కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ఈ ఫోన్లు సామ్‌సంగ్ Galaxy A, Galaxy M, Galaxy F సిరీస్‌లలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లన్నీ 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో వస్తాయి. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.

సామ్‌సంగ్ గెలాక్సీ A06, M16, F06, F16 5G ఫోన్లు కంపెనీ సైట్‌లో ఉన్నాయి. వీటిలో Galaxy A06,  Galaxy F06 బడ్జెట్ ధరలలో విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు రూ. 10,000 ప్రైస్ రేంజ్‌లో రావచ్చు.  వాటి ఫీచర్లు కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అలానే Galaxy M16 , Galaxy F16 దాదాపు ఒకే విధమైన ఫీచర్లతో లాంచ్ అవుతాయి. ఈ రెండు ఫోన్‌లు రూ.15,000 ధర పరిధిలోకి రావచ్చు. ఈ ఫోన్‌లన్నీ కొన్ని రోజుల క్రితం భారత వెబ్‌సైట్ BISలో కూడా కనిపించాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ A06 మోడల్ నంబర్ SM-A066B/DS, గెలాక్సీ F06 SM-E066B/DS, గెలాక్సీ F16 SM-E166P/DS, గెలాక్సీ M16 SM-M166P/DSగా ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ డ్యూయల్ సిమ్ కార్డ్, 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో వస్తాయి. కంపెనీ సపోర్ట్ పేజీలో ఈ ఫోన్ మోడల్ నంబర్లు  కనిపిస్తున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ A06, F06 స్మార్ట్‌ఫోన్లు మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. ఈ రెండు ఫోన్‌లు 4GB RAMతో 128GB వరకు స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌లు రానున్నాయి. గెలాక్సీ M16, గెలాక్సీ F16 ఫోన్లలో 6.7 అంగుళాల FHD+ డిస్ ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లలో మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రెండు ఫోన్‌లను ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ చేయచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News