Samsung Galaxy S25 Edge Launch: మార్కెట్లో ముచ్చెమటలే.. రేపే సామ్‌సంగ్ సన్నని ఫోన్ లాంచ్.. కెమెరా నెక్స్ట్ లెవల్..!

Samsung Galaxy S25 Edge Launch: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ సూపర్ స్లిమ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S25 Edge బలమైన ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

Update: 2025-05-12 15:30 GMT

Samsung Galaxy S25 Edge Launch: మార్కెట్లో ముచ్చెమటలే.. రేపే సామ్‌సంగ్ సన్నని ఫోన్ లాంచ్.. కెమెరా నెక్స్ట్ లెవల్..!

Samsung Galaxy S25 Edge Launch: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ సూపర్ స్లిమ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S25 Edge బలమైన ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ కాంపాక్ట్, స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశం,ఇతర ప్రపంచ మార్కెట్లలో రేపు అంటే మే 13, 2025న విడుదల చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 2025 సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరికరాల్లో ఒకటి, ఇది మార్కెట్లో ఐఫోన్ 17 ఎయిర్ వంటి స్మార్ట్‌ఫోన్‌లతో నేరుగా పోటీపడుతుంది.

గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ డిజైన్, మందం, బరువు మరియు కెమెరా వివరాలను బ్రాండ్ ఇప్పటికే షేర్ చేసింది. లీక్‌ల ద్వారా ఇతర స్పెసిఫికేషన్లు బయటపడ్డాయి, ఇవి ఫోన్ దాదాపు అన్ని వివరాలు, ఫీచర్లను వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ లాంచ్, లైవ్ ఈవెంట్, ధర, ఫీచర్స్‌కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

Samsung Galaxy S25 Edge Launch Date

సామ్‌సంగ్ తన రాబోయే ఫోన్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ అధికారిక లాంచ్ ఈవెంట్‌కు బియాండ్ స్లిమ్ అని పేరు పెట్టింది. బియాండ్ స్లిమ్ ఈవెంట్‌లో భాగంగా, గెలాక్సీ S25 ఎడ్జ్ రేపు, మే 13, 2025న ఉదయం 5:30 ISTకి సేల్‌ ప్రారంభమవుతుంది. దీని లైవ్ సామ్‌సంగ్ వెబ్‌సైట్, యూట్యూబ్‌లో ఉంటుంది.

Samsung Galaxy S25 Edge Specifications

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ S25 ఎడ్జ్ కేవలం 5.8మిమీ మందంతో ఉంటుంది. స్లిమ్ కెమెరా బంప్ కలిగి ఉంటుంది. దీని బరువు 170 గ్రాములు, ఇది లాంచ్ అయిన తర్వాత అత్యంత తేలికైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. దీనికి S25 అల్ట్రా లాంటి టైటానియం ఫ్రేమ్ ఉంటుందా లేదా S25/S25 ప్లస్ లాంటి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది, ఇది QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటక్షన్ ఉంటుంది.

Samsung Galaxy S25 Edge Processor

ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ లేదా సామ్‌సంగ్ ఇన్-హౌస్ ఎక్సినోస్ చిప్‌సెట్ ఉండచ్చు. దీనికి కనీసం 12జీబీ ర్యామ్, 256జీబీ నుండి 1టీబీ స్టోరేజ్ ఉంటుందని భావిస్తున్నారు. గెలాక్సీ S25 ఎడ్జ్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 పై రన్ అవుతుంది. బ్యాటరీ 3,900mAh కావచ్చు, ఇది 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Samsung Galaxy S25 Edge Camera

ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరా ఉండచ్చు, ఇది బహుశా S25 అల్ట్రాలోని ISOCELL HP2 సెన్సార్ అధునాతన వెర్షన్ కావచ్చు. రెండవ కెమెరా అల్ట్రావైడ్ లేదా టెలిఫోటో లెన్స్ కావచ్చు. దాని స్లిమ్ ఫారమ్ ఫ్యాక్టర్ కారణంగా, ఫ్లాగ్‌షిప్-స్థాయి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించడానికి సామ్‌సంగ్ కెమెరా అసెంబ్లీలో గణనీయమైన మార్పులు చేసింది

Samsung Galaxy S25 Edge Price

స్పెసిఫికేషన్ల ప్రకారం, మార్కెట్లో గెలాక్సీ S25 ఎడ్జ్ స్థానం గెలాక్సీ S25, S25 అల్ట్రా మధ్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దాని ధరను వీటి మధ్య కూడా ఉంచచ్చు. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 1,10,000 ఉంటుందని అంచనా.

Tags:    

Similar News