Samsung Galaxy S24 Ultra: రూ.22,800 వరకు తగ్గింపు.. ఈ ఆఫర్‌ మిస్‌ చేసుకోవద్దు తమ్ముళ్లు!

Samsung Galaxy S24 Ultra: 5000mAh బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన ఈ ఫోన్ 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మొత్తం రోజు ఎనర్జీతో ఉండే అవకాశం ఉంది.

Update: 2025-04-12 02:30 GMT

Samsung Galaxy S24 Ultra: రూ.22,800 వరకు తగ్గింపు.. ఈ ఆఫర్‌ మిస్‌ చేసుకోవద్దు తమ్ముళ్లు!

Samsung Galaxy S24 Ultra: సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్‌లో టాప్-ఎండ్ డివైస్‌గా నిలిచే గెలాక్సీ S24 అల్ట్రా 5G ఇప్పుడు భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఖరీదైన ఫోన్ కావడంతో ఇది అందరి బడ్జెట్‌కు సరిపడకపోవచ్చు. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఎవరైతే ప్రీమియం లెవెల్ ఫోన్ కొనాలని చూస్తున్నారో, వాటిలో కెమెరా పనితీరు, గేమింగ్, ఎయ్ ఫీచర్స్ ముఖ్యంగా కావాలని అనుకుంటున్నారో.. వారికే ఇది బెస్ట్ డీలుగా మారింది.

ఈ ఫోన్ అసలు ధర రూ.1,34,999గా ఉండగా, అమెజాన్ ఇప్పుడు దీన్ని రూ.92,215కి ఆఫర్ చేస్తోంది. అంటే సుమారుగా 32 శాతం తగ్గింపు. అంతేకాదు, తక్కువ బడ్జెట్‌తో కొనాలనుకునే వారికి నెలకు రూ.4,152 EMI ఆప్షన్ కూడా ఉంది. పాత ఫోన్ ఇచ్చి మార్పిడి ధరగా రూ.22,800 వరకు తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది. అదీ కాకుండా పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉంటే.. ఈ ఫోన్‌ను కేవలం రూ.69,000కే పొందే ఛాన్స్ ఉంటుంది.

గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫీచర్ల పరంగా చూస్తే.. 6.8 అంగుళాల డైనమిక్ LTPO AMOLED డిస్‌ప్లే ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది కార్నింగ్ గోరిల్లా ఆర్మర్ స్క్రీన్ ప్రొటెక్షన్‌తో వస్తోంది. మోటా టైటానియం ఫ్రేమ్‌ మరియు గ్లాస్ బ్యాక్ ఈ ఫోన్‌కు స్టైలిష్ లుక్ ఇస్తాయి.

స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది 12GB RAM మరియు గరిష్టంగా 1TB స్టోరేజ్ వరకు లభిస్తుంది. కెమెరా పరంగా 200+10+50+12MPలతో కూడిన వెనుక కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన ఈ ఫోన్ 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే మొత్తం రోజు ఎనర్జీతో ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News