Samsung Galaxy A36 5G: సామ్‌సంగ్ గెలాక్సీ A36 ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే
Samsung Galaxy A36 5G: సామ్‌సంగ్ కొత్త Samsung Galaxy A36 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేయబోతోంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ ప్రస్తుతం BIS సర్టిఫికేషన్ దశలో ఉంది. కాబట్టి ఈ Samsung Galaxy A36 స్మార్ట్‌ఫోన్‌ను వీలైనంత త్వరగా భారతదేశంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా మోడల్ నంబర్ SM-A366E/DSతో Samsung Galaxy A36 ఫోన్ BIS ధృవీకరణ సైట్‌లో కనిపించింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన డిజైన్, నాణ్యత ఫీచర్లతో వస్తుంది. అలాగే ఆన్‌లైన్‌లో ఈ ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.
కొత్త Samsung Galaxy A36 5G ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. వీడియో ఎడిటింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్‌లో అమర్చిన చిప్‌సెట్ మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో 6.5-అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీని డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్, అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే మెరుగైన స్క్రీన్ అనుభూతిని అందిస్తుంది.
ఈ కొత్త Samsung Galaxy A36 స్మార్ట్‌ఫోన్ One UI 7-ఆధారంగా ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఫోన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా వస్తాయని చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ లెన్స్ + 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ సహాయంతో మీరు అద్భుతమైన ఫోటోలను తీయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16MP కెమెరా కూడా ఉంది. ఇందులో LED ఫ్లాష్, వివిధ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ A36 5000mAh బ్యాటరీతో విడుదల కానుంది. ఈ ఫోన్ రోజంతా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జర్ అందిస్తున్నారు. కాబట్టి ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, 5G SA/NSA, డ్యూయల్ 4G VoltE, Wi-Fi 6 802.11PE, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, గెలీలియో వంటి డీఫాల్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ.30,000 గా ఉంటుందని తెలుస్తోంది.