Samsung Galaxy M06 5G: రూ.9,999లకే సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఊహించలేరు..!
Samsung Galaxy M06 5G: సామ్‌సంగ్ ఇటీవల రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది.
Samsung Galaxy M06 5G: రూ.9,999లకే సామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఊహించలేరు..!
Samsung Galaxy M06 5G: సామ్‌సంగ్ ఇటీవల రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఇవి Samsung Galaxy M06 5G, Samsung Galaxy M16 5G పేర్లతో మార్కెట్లోకి ప్రవేశించాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్టైలిష్ డిజైన్, గొప్ప ఫీచర్లతో వస్తాయి. వీటిలో Samsung Galaxy M06 5G మొబైల్ మొదటి సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy M06 5G Price
సామ్‌సంగ్ గెలాక్సీ M06 5G ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. అలాగే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.11,499కి లాంచ్ అయింది. ఈ మొబైల్ కొనుగోలుపై కంపెనీ రూ.500 బ్యాంక్ డిస్కౌంట్ ప్రకటించింది.
డిస్కౌంట్ తర్వాత మీరు ఈ ఫోన్‌ను రూ.9,499, రూ.10,999కి కొనుగోలు చేయచ్చు. సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఈ మొబైల్‌ని ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ సేజ్ గ్రీన్, బ్లేజింగ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
Samsung Galaxy M06 5G Features
సామ్‌సంగ్ గెలాక్సీ M06 5G మొబైల్‌లో 6.74-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది వాటర్‌డ్రాప్ నాచ్ స్క్రీన్. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ ఇస్తుంది. భద్రత కోసం స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7.0 OSతో పని చేస్తుంది. 4 సంవత్సరాల పాటు 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.
మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, సెల్ఫీల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 5G బ్యాండ్‌లు ఉన్నాయి. ఇది మంచి 5G నెట్‌వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్‌ని అందిస్తుంది.