Reliance Jio: 2025లో జియో సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
Reliance Jio New year welcome plans: ఈ ఏడాది అన్ని టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా భారీగా పెరిగిన టారిఫ్‌లతో యూజర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. సుమారు 10 శాతం ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే తాజాగా యూజర్లను ఆట్టుకునేందుకు ప్రత్యేక ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ముఖ్యంగా కొత్తేడాది నేపథ్యంలో కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెలికం సంస్థ జియో యూజర్ల కోసం కొత్తేడాది కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
2025 ఏడాదిలోకి ఎంటర్ అవుతోన్న నేపథ్యంలో రూ. 2,025 పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ ప్లాన్ కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. డిసెంబర్ 11వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 11వ తేదీ వరకు మాత్రమే ప్లాన్ అందుబాటులో ఉండనుంది. ఈ మధ్య రీఛార్జ్ చేసుకుంటేనే ఈ ప్లాన్ బెనిఫిట్స్ పొందుతారు.
న్యూఇయర్ వెల్‌కం ప్లాన్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే యూజర్లు అన్‌లిమిటెడ్ 5జీ సేవలను పొందొచ్చు. ప్రతి రోజూ 2.5 జీబీ డేటా చొప్పున 500 జీబీ (4జీ) డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే నెలకు రూ. 349 చొప్పున పడుతుందన్నమాట. ఇక రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు షాపింగ్, డైనింగ్, ప్రయాణ సమయంలో రూ.2150 విలువ గల పార్టనర్ కూపన్లు కూడా లభిస్తాయి.
వీటితో పాటు అదనంగా మరిన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తున్నారు. రూ. 2500 విలువగల షాపింగ్ చేస్తే రూ. 500 విలువైన జియో కూపన్ లభిస్తుంది. అలాగే స్విగ్గీ ఆర్డర్‌పై డిస్కౌంట్ పొందొచ్చు. రూ. 499 అంతకంటే ఎక్కువ స్విగ్గీ ఆర్డర్స్‌పై రూ. 150 డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈజీమై ట్రిప్‌లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం పొందొచ్చని జియో తెలిపింది.