Redmi Note 14 Pro 5G Price Cut: అమెజాన్ పిచ్చెక్కించేసింది .. రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీపై ఆఫర్ల జాతర.. ఊరమాస్ డీల్..!
Redmi Note 14 Pro 5G Price Cut: రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీ ధర భారీగా తగ్గింది. ఈ రెడ్‌మీ ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 13 ప్రో అప్‌గ్రేడ్ మోడల్.
Redmi Note 14 Pro 5G Price Cut: అమెజాన్ పిచ్చెక్కించేసింది .. రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీపై ఆఫర్ల జాతర.. ఊరమాస్ డీల్..!
Redmi Note 14 Pro 5G Price Cut: రెడ్‌మీ నోట్ 14 ప్రో 5జీ ధర భారీగా తగ్గింది. ఈ రెడ్‌మీ ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 13 ప్రో అప్‌గ్రేడ్ మోడల్. ఇందులో 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉంటాయి. మీరు ఈ రెడ్‌మీ ఫోన్‌ను దాని లాంచ్ ధర కంటే వేల రూపాయల తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Redmi Note 14 Pro 5G Offers
రెడ్‌మీ నోట్ 14 ప్రో ధర ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రూ.28,90గా ఉంది. డిస్కౌంట్ తర్వాత, ఈ ఫోన్ రూ.21,090 ధరకు లభిస్తుంది. ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై రూ. 2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ విధంగా, ఈ మిడ్-బడ్జెట్ రెడ్‌మీ ఫోన్‌ను రూ. 19,090 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999 ప్రారంభ ధరకు జాబితా చేశారు. ఈ ఫోన్ కొనుగోలుపై 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు.
Redmi Note 14 Pro Features
రెడ్‌మీ నుండి వచ్చిన ఈ మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 1.5K కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP68, IP69 రేటింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది, దీని కారణంగా నీటిలో మునిగిపోయిన తర్వాత కూడా ఫోన్ దెబ్బతినదు.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్‌ఓఎస్‌పై పనిచేస్తుంది. మొబైల్‌లో 45W USB టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌తో 5,500mAh బ్యాటరీ ఉంది.
రెడ్‌మి నోట్ 14 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఫోన్‌లో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, 8మెగాపిక్సెల్, 2మెగాపిక్సెల్‌ల మరో రెండు కెమెరాలు అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.