Redmi A4 5G Discount: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. రూ.8,340కే రెడ్‌మి 5జీ ఫోన్

Redmi A4 5G Discount: రెడ్‌మి గతేడాది నవంబర్‌లో 'REDMI A4 5G' ని విడుదల చేసింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

Update: 2025-02-02 13:45 GMT

Redmi A4 5G Discount: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. రూ.8,340కే రెడ్‌మి 5జీ ఫోన్

Redmi A4 5G Discount: రెడ్‌మి గతేడాది నవంబర్‌లో 'REDMI A4 5G' ని విడుదల చేసింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్‌లో ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. మీరు ఎలాంటి ఆఫర్ లేకుండానే రూ.10,000 కంటే తక్కువ ధరకు ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ.8,340 అవుతుంది. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

REDMI A4 5G Offers

ఈ రెడ్‌మి ఫోన్ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్ లేకుండా రూ.9,090కి సేల్‌లో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ ఈ ఫోన్‌ను రూ.10,999కి విడుదల చేసింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ కార్డ్‌ ద్వారా ఫోన్‌పై రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో మీరు కేవలం రూ.8,340కే ఫోన్‌ని మీ ఇంటికి తీసుకెళ్లచ్చు.

REDMI A4 5G Specifications

ఫోన్ వెనుక భాగంలో ఒక రౌండ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఫోన్ టాప్ ఎడ్జ్‌లో 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్ ఉంది. అలానే ప్రీమియం లుకింగ్ హాలో గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే చూడచ్చు. 

ఈ రెడ్‌మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌, 4nm స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌లో 2GHz వరకు క్లాక్ చేసిన రెండు కార్టెక్స్-A78 కోర్స్, 1.8GHz వరకు క్లాక్ చేసిన ఆరు కార్టెక్స్-A55 కోర్స్ ఉన్నాయి. ఫోన్‌ LPDDR4x RAM, UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. అలానే డ్యూయల్-కెమెరా సెటప్ AI ఫీచర్లతో వస్తుంది. కెమెరా ఫీచర్లలో టైమ్-లాప్స్, పోర్ట్రెయిట్ మోడ్, 10x జూమ్ ఉన్నాయి. సెల్ఫీల  కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5,160mAh బ్యాటరీని అందించారు.

Tags:    

Similar News