Realme Upcoming Smartphones: అప్పుడేనా.. రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్లు వస్తున్నాయ్

Update: 2025-02-02 14:59 GMT

Realme Upcoming Smartphones List: అప్పుడేనా.. రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్లు వస్తున్నాయ్

Realme Upcoming Smartphones List: రియల్‌మి ఈ సంవత్సరం వివిధ విభాగాలలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ P3 సిరీస్‌లో P3, P3 Pro, నియో సిరీస్‌లో Neo 7 ను తీసుకురానుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. త్వరలోనే ఈ ఫోన్లు ఇండియాన్ మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రియల్‌మి నియో 7

రియల్‌మి నుండి ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్‌ని ఇప్పటికే చైనాలో లాంచ్ చేశారు. మోడల్ నంబర్ RMX5061తో భారతీయ వేరియంట్ కొన్ని చిన్న సాఫ్ట్‌వేర్, ఫీచర్ మార్పులతో వస్తుంది. ఫోన్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 9300+ చిప్‌సెట్‌, 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే... 50MP మెయిన్ కెమెరా, OISతో 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌ ధర దాదాపు రూ. 25,000 వరకు ఉండొచ్చు.

రియల్‌మి P3

కంపెనీ P-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 45W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,860mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఫోన్ 6GB + 126GB, 8GB + 128GB, 8GB + 256GB అనే మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ నెబ్యులా పింక్, కామెట్ గ్రే, స్పేస్ సిల్వర్ అనే మూడు కలర్స్‌లో లాంచ్ అవుతుంది. ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్షన్ చిప్‌సెట్ ఉంటుంది. 

రియల్‌మి P3 అల్ట్రా

ఈ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో మార్కెట్‌ను రాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. మొబైల్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. P3 అల్ట్రా ఒక గ్రే షేడ్‌లో మాత్రమే లభించే అవకాశం ఉంది. గ్లాసీ ప్యానెల్ డిజైన్‌తో ఇతర మోడళ్లకు భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతానికి దీని చిప్‌సెట్ గురించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ ఫోన్ హై-ఎండ్ మీడియాటెక్ లేదా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఉంటుందని భావిస్తున్నారు. 

Tags:    

Similar News