Realme P3 Series Launched: రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్లు.. ఫీచర్స్ లీక్..!

Realme P3 Series Launched: టెక్ బ్రాండ్ రియల్‌మి భారతీయ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించనుంది.

Update: 2025-01-17 07:36 GMT

Realme P3 Series Launched: రియల్‌మి నుంచి సరికొత్త ఫోన్లు.. ఫీచర్స్ లీక్..!

Realme P3 Series Launched: టెక్ బ్రాండ్ రియల్‌మి భారతీయ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించనుంది. మోస్ట్ అవైటింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ రియల్‌మి 14 ప్రోని విడుదల చేసింది. ఇప్పుడు దేశీయ మార్కెట్‌లో మరో కొత్త పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి బ్రాండ్ ప్లాన్ చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. కంపెనీ ఈ ఫోన్‌‌ను Realme P3 Seriesగా పరిచయం చేయనుంది. ఇందులో రియల్‌మి P3, P3 Pro, P3 Ultra మోడల్స్ ఉంటాయి.

ఇంటర్నెట్‌లో రియల్‌మి P3 అల్ట్రా,  P3 ప్రో గురించి ముఖ్యమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. రియల్‌మి p3 స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్, కాన్ఫిగరేషన్,కలర్ ఆఫ్షన్లను వెల్లడించింది. దీని మోడల్ నంబర్ RMX5070. ఇది మూడు కాన్ఫిగరేషన్‌లలో మార్కెట్లోకి వస్తుంది. అందులో 6GB+128GB, 8G+128GB, 8GB+256GB  ఉంటాయి. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌లో రానుంది. వీటిలో నెబ్యులా పింక్, కామెట్ గ్రే, స్పేస్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. 

రియల్‌మి P3 సిరీస్‌ను గత సంవత్సరం ప్రారంభించిన P2 సిరీస్‌కు సక్సెసర్‌గా పరిచయం చేయవచ్చు. ఇందులో P2 ప్రో మోడల్ మాత్రమే ఉంది. అయితే బ్రాండ్ ఈ కొత్త హ్యాండ్‌సెట్ సిరీస్‌లో రియల్‌మి P3 ప్రో (RMX5030), P3 అల్ట్రా (RMX5032) మోడల్‌లను కూడా నేర్చబోతోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ల ప్రో మోడల్‌లు 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. అయితే P3 అల్ట్రా (RMX5032) కూడా అదే ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. గ్రే కలర్‌లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. నివేదికల ప్రకారం రియల్‌మి P3 ప్రో ఫిబ్రవరి 2025 మూడవ వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే P3 అల్ట్రా ఈ నెలాఖరులో మార్కెట్లోకి రావచ్చు.

Tags:    

Similar News