Realme Narzo 80x 5G: రియల్‌మీ నుంచి సరైన ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

Update: 2025-03-09 07:00 GMT

Realme Narzo 80x 5G: టెక్ మేకర్ రియ‌ల్‌మీ భారత్‌లో గతేడాది ఏప్రిల్ నెలలో శక్తివంతమైన ఫోన్ 'Realme Narzo 70x 5G'ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మంచి సక్సెస్‌ను అందుకుంది. అలానే ఇందులోని ఫీచర్లే ఈ ఫోన్ సక్సెసర్‌కి కారణంగా చెప్పచ్చు. ఇప్పుడు కంపెనీ దాని అప్‌గ్రేడ్ వెర్షన్‌గా 'Realme Narzo 80x 5G'ని త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. తాజాగా ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో అనేక ర్యామ్, స్టోరేజ్, కలర్ ఎంపికలు ఉంటాయి. రియల్‌మీ నార్జో 80 ప్రో, నార్జో 80 అల్ట్రా వేరియంట్‌లపై కూడా కంపెనీ పనిచేస్తోందని మునుపటి నివేదికలు తెలిపాయి. అయితే, నార్జో 80 సిరీస్ గురించి రియల్‌మీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాన్ని ధృవీకరించలేదు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం... Realme Narzo 80x 5G మోడల్ నంబర్ RMX3944. కంపెనీ ఇప్పటికే విడుదల చేసిన Realme P3x 5G కూడా అదే మోడల్ నంబర్‌‌తో విడుదలైంది. ఫోన్ మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుందని నివేదిక సూచిస్తుంది. అందులో 6GB + 128GB, 8GB + 128GB,12GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ సన్‌లిట్ గోల్డ్, డీప్ ఓషన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రియల్‌మీ నార్జో 70x 5జీకి సమానంగా ఉండే అవకాశం ఉంది.

Realme Narzo 70x 5G Price

అయితే ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ 4GB + 128GB వేరియంట్‌ ధర10,999, 6GB + 128GB వేరియంట్‌ ధర రూ. 11,999. ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్, 5,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 6.72-అంగుళాల ఫుల్-HD+ LCD స్క్రీన్ ఉన్నాయి.

Tags:    

Similar News