Realme GT 7 Dream Edition: గేమింగ్‌లో దిట్ట.. రియల్‌మీ స్పెషల్ ఎడిషన్.. డార్క్ గ్రీన్ కలర్లో భలే ఉందిగా..!
Realme GT 7 Dream Edition: రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 27 మే 2025న దేశంతో పాటు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.
Realme GT 7 Dream Edition: గేమింగ్‌లో దిట్ట.. రియల్‌మీ స్పెషల్ ఎడిషన్.. డార్క్ గ్రీన్ కలర్లో భలే ఉందిగా..!
Realme GT 7 Dream Edition: రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 27 మే 2025న దేశంతో పాటు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ స్పెషిల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ఆస్టన్ మార్టిన్ ఫార్ములా 1 బృందంతో కలిసి విడుదల చేయనున్నట్లు రియల్‌మీ అధికారికంగా ధృవీకరించింది. రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఆస్టన్ మార్టిన్ బ్రాండెడ్ టూల్స్‌తో ప్రత్యేక కలర్ ఆప్షన్ వస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త, ఆసక్తికరమైన ఫీచర్స్‌తో వస్తుంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్‌ను తన భారతదేశం, గ్లోబల్ వెబ్‌సైట్‌లలో ప్రత్యేక ల్యాండింగ్ పేజీ ద్వారా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఫోన్ వెనుక డిజైన్‌ను చూపించే మైక్రోసైట్‌ను కూడా అ. ఆస్టన్ మార్టిన్ అరాంకో ఫార్ములా వన్ బృందంతో కలిసి రియల్‌మి కొత్త హ్యాండ్‌సెట్‌ను రూపొందించిందని పేజీలు చూపిస్తున్నాయి.
Realme GT 7 Dream Edition Features
టీజర్లలో ఫోన్ వెనుక ప్యానెల్ ఆస్టన్ మార్టిన్ సిగ్నేచర్ గ్రీన్ కలర్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది. వెనుక ప్యానెల్ మధ్యలో ఆస్టన్ మార్టిన్ ఐకానిక్ టూ-వింగ్ లోగో ఉంది, ఇది ఫార్ములా వన్ జట్టుతో దాని భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్‌లో ఆస్టన్ మార్టిన్-సంబంధిత ఐకాన్స్, థీమ్‌లు, టూల్స్ ఉంటాయని తెలుస్తుంది. రియల్‌మీ జిటి 7 డ్రీమ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్, సిరీస్ ఒరిజినల్ మోడల్ రియల్‌మి జిటి 7 మాదిరిగానే హార్డ్‌వేర్ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ ఈవెంట్ 2025 మే 27న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది.