Realme P4 Power: జెన్ Z కోసం జెన్ Z డిజైన్‌తో రియల్‌మీ P4 పవర్ స్మార్ట్‌ఫోన్

పెరల్ అకాడమీ విద్యార్థుల భాగస్వామ్యంతో ‘ఫర్ జెన్ Z, బై జెన్ Z’ డిజైన్ తత్వంతో రూపొందిన రియల్‌మీ P4 పవర్ స్మార్ట్‌ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది.

Update: 2026-01-19 09:25 GMT

Realme P4 Power: జెన్ Z కోసం జెన్ Z డిజైన్‌తో రియల్‌మీ P4 పవర్ స్మార్ట్‌ఫోన్

Realme P4 Power: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (realme) తన కొత్త మోడల్ రియల్‌మీ P4 పవర్ను త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం ఫీచర్లపైనే కాకుండా డిజైన్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ, జెన్ Z యువత అభిరుచులను ప్రతిబింబించేలా రూపొందించడం.

‘ఫర్ జెన్ Z, బై జెన్ Z’ అనే డిజైన్ తత్వంతో రియల్‌మీ ఈ ఫోన్‌ను అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో ప్రముఖ డిజైన్ సంస్థ పెరల్ అకాడమీ విద్యార్థులతో కలిసి పనిచేయడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల ఆలోచనలు, కాన్సెప్ట్‌లను వర్క్‌షాప్‌ల ద్వారా స్వీకరించి, వాటిలో ఉత్తమమైన డిజైన్‌ను తుది ఉత్పత్తిలో భాగం చేసింది.

రియల్‌మీ P4 పవర్‌లో ప్రవేశపెట్టిన ‘ట్రాన్స్‌వ్యూ డిజైన్’ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఫోన్ లోపలి సాంకేతిక అంశాల నుంచి ప్రేరణ పొందిన ఈ డిజైన్‌లో, పైభాగంలో సర్క్యూట్ ప్యాటర్న్‌లు, స్క్రూలతో కూడిన క్రిస్టల్ ప్యానెల్ కనిపిస్తుండగా, కింది భాగంలో మ్యాట్ ఫినిషింగ్‌తో మెరుగైన గ్రిప్‌ను అందించారు. దీంతో టెక్నాలజీ, స్టైల్ రెండింటినీ సమపాళ్లలో మేళవించారు.

ఈ డిజైన్ రూపకల్పనలో సంకల్ప్ పాంచాల్ అనే పెరల్ అకాడమీ విద్యార్థి అందించిన కాన్సెప్ట్‌కు తుది రూపంలో చోటు కల్పించారు. మాస్ మార్కెట్ కోసం విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్‌లో విద్యార్థుల డిజైన్ ఆలోచనలను నేరుగా అమలు చేయడం ఇదే తొలిసారి అని రియల్‌మీ తెలిపింది.

ప్రస్తుత జెన్ Z యువతకు స్మార్ట్‌ఫోన్ ఒక సాధనం మాత్రమే కాకుండా, వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశంగా మారిందని రియల్‌మీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే, పనితీరుతో పాటు డిజైన్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తూ P సిరీస్‌ను భారతీయ యువత అభిరుచులకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News