Realme P3 Pro Launch: రియల్‌మి నుంచి కొత్త ఫోన్.. గేమింగ్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్..!

Realme P3 Pro Launch: రియల్‌మి ఇండియా తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'Realme P3 Pro' లాంచ్ తేదీని వెల్లడించింది.

Update: 2025-02-07 07:21 GMT

Realme P3 Pro Launch: రియల్‌మి నుంచి కొత్త ఫోన్.. గేమింగ్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్..!

Realme P3 Pro Launch: రియల్‌మి ఇండియా తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'Realme P3 Pro' లాంచ్ తేదీని వెల్లడించింది. ఇటీవల కంపెనీ ఒక ఈవెంట్‌లో ఈ తేదీని ప్రకటించింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. P3 ఫోన్‌లో క్వాల్‌కమ్ చిప్‌సెట్, కర్వ్డ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీ ఉంటాయి. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme P3 Pro Launch Date

రియల్‌మి పీ3 ప్రో భారత్‌లో ఫిబ్రవరి 18న లాంచ్ అవుతుంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు సేల్‌కి వస్తుందనేది కంపెనీ వెల్లడించలేదు. ఫోన్ లాంచ్ అయిన మూడవ వారంలో సేల్‌కి రావచ్చని భావిస్తున్నారు. Realme P3 ప్రో ధర గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే దీని హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే దీని ధర దాదాపు రూ.30,000 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Realme P3 Pro Features

ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 3 (4nm) ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్‌సెట్ AnTuTu 10 బెంచ్‌మార్క్‌లో 800K+ స్కోర్‌ను సాధించింది. Realme P3 Pro కాకుండా, Realme 14 Pro Plus, Redmi Note 14 Pro Plus వంటి స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఇదే ప్రాసెసర్‌లో రన్ అవుతాయి.

ఈ ఫోన్‌లో క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్‌ఫ్లో డిస్‌ప్లేఉంటుంది. అంతేకాకుండా 6000mAh టైటాన్ బ్యాటరీని ఉంది. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. మీరు గేమింగ్ లవర్స్ అయితే రియల్‌మి పి3 ప్రో బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫోన్‌లో గేమింగ్ కోసం GT బూస్ట్ మోడ్‌ను ఇచ్చారు. క్రాఫ్టన్ సహకారంతో ఈ మోడ్‌ను డెవలప్ చేశారు. ఈ ఫీచర్ ముఖ్యంగా BGMI వంటి హై-ఎండ్ గేమ్‌ల హై ఎండ్ మోడ్‌లో హ్యాండిల్ చేస్తుంది.

ఫోన్‌కు ఏరోస్పేస్ VC కూలింగ్ సిస్టమ్ అందించారు. ఈ కారణంగా ఎక్కువసేపు వేడెక్కకుండా సాఫీగా పని చేస్తుంది. అంతే కాకుండా.. AI అల్ట్రా-స్టెడీ ఫ్రేమ్‌లు, హైపర్ రెస్పాన్స్ ఇంజిన్, AI అల్ట్రా టచ్ కంట్రోల్,AI మోషన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags:    

Similar News