Realme P3 Pro 5G Price Drop: రియల్‌మి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ఆఫర్స్ చూస్తే అస్సలు మిస్ చేయరు..!

Realme P3 Pro 5G Price Drop: రియల్‌మి P సిరీస్‌లో గతవారం 'Realme P3x 5G' స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది.

Update: 2025-02-25 13:30 GMT

Realme P3 Pro 5G Price Drop: రియల్‌మి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ఆఫర్స్ చూస్తే అస్సలు మిస్ చేయరు..!

Realme P3 Pro 5G Price Drop

రియల్‌మి P సిరీస్‌లో గతవారం 'Realme P3x 5G' స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌‌లో 1.5K రిజల్యూషన్‌ ఆమోలెడ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, 80వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6,000mAh బ్యాటరీ ఉన్నాయి. అలానే మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.  అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌పోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme P3 Pro 5G Offers

రియల్‌మీ P3 ప్రో 5జీ 8జీబీ ర్యామ్,  128జీబీ స్టోరేజ్‌ బేస్ మోడల్ ధర రూ.23,999 నుండి ప్రారంభమవుతుంది. 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.24,999. ఫోన్‌ను గెలాక్సీ పర్పుల్, నెబ్యులా గ్లో, సాటర్న్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌లలో ఆర్డర్ చేయచ్చు. 

హ్యాండ్‌సెట్‌ను ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, కంపెనీ రూ. 2,000 బ్యాంక్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 2,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. అంటే మీకు నేరుగా కొత్త ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. 

Realme P3 Pro 5G Specifications

రియల్‌మీ P3 ప్రో 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6.0పై పని చేస్తుంది. ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ ఆమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌ ఉంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ అందిచారు. సోనీ IMX896 సెన్సార్‌తో50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 + IP69 రేటింగ్‌ అందించారు. అంతే కాకుండా 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని ఇచ్చారు.

Tags:    

Similar News