Realme P3 Series: రెండు బడ్జెట్ ఫోన్లు వచ్చాయి, ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
రియల్‌మి ఇండియాలో తన కొత్త P3 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది.
Realme P3 Series: రెండు బడ్జెట్ ఫోన్లు వచ్చాయి, ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
Realme P3 Series: రియల్‌మి ఇండియాలో తన కొత్త P3 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది.చైనీస్ బ్రాండ్ ఈ రెండు ఫోన్స్‌లో పవర్ ఫుల్ ఫీచర్స్, సరికొత్త ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి. 'Realme P3 Pro , Realme P3x' పేర్లతో ఈ రెండు ఫోన్‌లను కంపెనీ విడుదల చేసింది. వీటిలో 6,000mAh బ్యాటరీ, 12GB RAM సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త సిరీస్ గతేడాది విడుదల చేసిన Realme P2 సిరీస్ అప్‌గ్రేడ్.
Realme P3 Pro
ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌లో పని చేస్తుంది. ఫోన్‌లో 12GB RAM+ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ ర్యామ్, స్టోరేజ్‌ని పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.83 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఫోన్ డిస్‌ప్లే చుట్టూ క్వాడ్ కర్వ్డ్ డిజైన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.
ఈ బడ్జెట్ ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 80W USB టైప్ C ఛార్జర్ ఇచ్చారు. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. 50MP మెయిన్ OIS కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 16MP కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0పై పనిచేస్తుంది. గేమింగ్ ప్రియుల కోసం కంపెనీ ఈ ఫోన్‌లో వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ ఫీచర్‌ను అందించింది.
మీరు ఈ ఫోన్‌ను నెబ్యులా గ్లో, గెలాక్సీ పర్పుల్, సాటర్న్ బ్రౌన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఆర్డర్ చేయచ్చు. ఫోన్ మొదటి సేల్ ఫిబ్రవరి 25 న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. ఫోన్ కొనుగోలుపై మీరు రూ. 2,000 వరకు బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు.
Realme P3 Pro Price
8GB RAM + 128GB - Rs. 23,999
8GB RAM + 256GB - Rs. 24,999
12GB RAM + 256GB - Rs. 26,999
Realme P3x
ఈ బడ్జెట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 5G చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. 8GB RAM +128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ర్యామ్, స్టోరేజ్‌ని కూడా పెంచుకోవచ్చు. ఫోన్‌లో 6.72 అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. పవర్ కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0లో రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP + 2MP కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా ఉంది.
Realme P3x Price
6GB RAM + 128GB - Rs. 13,999
8GB RAM + 128GB - Rs. 14,999
ఈ ఫోన్‌ను మూడు కలర్ ఆప్షన్స్‌లో మీ సొంతం చేసుకోవచ్చు- లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ ,స్టెల్లార్ పింక్. ఫోన్ మొదటి సేల్ ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మొదలవుతుంది. ఫోన్ కొనుగోలుపై రూ.1,000 వరకు బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.