Realme GT 7 And GT 7T Launch: తోపు ఫోన్లు దిగుతున్నాయ్.. రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఈరోజే భారత్‌లోకి..!
Realme GT 7 And GT 7T Launch: రియల్‌మీ GT 7, రియల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్‌లు మే 27న అంటే ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ కానున్నాయి.
Realme GT 7 And GT 7T Launch: తోపు ఫోన్లు దిగుతున్నాయ్.. రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. ఈరోజే భారత్‌లోకి..!
Realme GT 7 And GT 7T Launch: రియల్‌మీ GT 7, రియల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్‌లు మే 27న అంటే ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ కానున్నాయి. రియల్‌మీ రాబోయే GT-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌కు ముందే రిటైలర్ వెబ్‌సైట్‌లలో జాబితా చేశారు. ఈ లిస్టింగ్ ద్వారా రాబోయే స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వెల్లడైంది. రియల్‌మీ GT 7 స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. రియల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్ 6.68-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రియల్‌మీ ఫోన్‌లు 50-మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Realme GT 7 Series Price
రియల్‌మీ GT 7, రీయల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌కు ముందే అమెజాన్ జర్మనీ వెబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ లిస్టింగ్ ప్రకారం..రియల్‌మీ GT 7 బేస్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది, దీని ధర 749 యూరోలు సుమారు రూ. 72,000. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్‌తో రెండవ వేరియంట్ 799 యూరోలు సుమారు రూ. 77,000గా ఉండే అవకాశం ఉంది.
12జీబీ ర్యామ్ + 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన రియల్‌మీ GT 7T బేస్ వేరియంట్ ధర 649 యూరోలు దాదాపు రూ. 62,000. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ కలిగిన మరొక వేరియంట్ ధర 699 యూరోలు దాదాపు రూ. 68,000గా ఉంది. రియల్‌మీ GT 7 స్మార్ట్‌ఫోన్ ఐస్సెన్స్ బ్లాక్, ఐస్సెన్స్ బ్లూ షేడ్స్‌లో వస్తుంది. దీనితో పాటు, రియల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్ ఐస్సెన్స్ బ్లూ, ఐస్సెన్స్ ఎల్లో కలర్ ఆప్షన్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
Realme GT 7 Specifications
రియల్‌మీ GT 7 స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది, ఇది 1.5K రిజల్యూషన్, 6,000నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ ఇస్తుంది. ఈ రియల్‌మీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌తో రన్ అవుతుంది, దీనిలో కూలింగ్ కోసం 7,700మి.మీ వేపర్ చాంబర్ కూలింగ్ సెటప్ ఉంటుంది.ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, ఇది సోనీ IMX906 సెన్సార్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కు సపోర్ట్ ఇస్తుంది.
Realme GT 7T Specifications
రియల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ రియల్‌మీ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400-మాక్స్ చిప్‌సెట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్, ఇది సోనీ IMX896 సెన్సార్. దీనితో పాటు, ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందించారు. రియల్‌మీ GT 7, రియల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్‌లు రెండూ 7,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. రెండు రియల్‌మీ ఫోన్‌లకు IP69 రేటింగ్ లభించింది. దీనితో పాటు, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6.0 పై పనిచేస్తాయి.