PhonePe: మొబైల్ రీఛార్జ్ పై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్న ఫోన్ పే

* భారత మార్కెట్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ ఆన్లైన్ వాలెట్ ఫోన్ పే ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేయడం ప్రారంభించింది.

Update: 2021-10-26 10:59 GMT

PhonePe: మొబైల్ రీఛార్జ్ పై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్న ఫోన్ పే

PhonePe: భారత మార్కెట్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ ఆన్లైన్ వాలెట్ ఫోన్ పే వినియోగదారుల నుండి ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేయడం ప్రారంభించింది. ఫోన్ పే అప్లికేషన్‌ని ఉపయోగించి తమ సిమ్‌ వ్యాలిడిటీని రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు రీఛార్జ్ కంటే అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ పే ఇకపై యూజర్లు జరపనున్న ప్రతి లావాదేవిలపై అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజును విధించింది.

అందులో భాగంగా 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు చేసే రీఛార్జ్ కి ఒక్క రూపాయిని, 100 నుండి ఆపై చేసే రీఛార్జ్ లకు గాను 2 రూపాయలను ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేస్తుంది. అయితే ఒక్క ఫోన్ పే తప్ప మిగిలిన మొబైల్ వాలెట్ అప్లికేషన్స్ గూగుల్ పే, పేటియంలు వినియోగదారుల నుండి ఎలాంటి ప్రాసెసింగ్ వసూలు చేయకపోవడంతో కొంతమంది యూజర్లు గూగుల్ పే, పేటియం వైపు మొగ్గు చూపుతున్నారు.ఇక వినియోగదారుడు ఏ మొబైల్ నెట్వర్క్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ అధికారిక అప్లికేషన్స్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఎలాంటి అధిక ఛార్జ్ లేకుండా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News