Oppo Reno 14: కింగ్ వస్తున్నాడు.. ఒప్పో నుంచి ఐఫోన్ లాంటి మొబైల్.. ఫీచర్స్, డిజైన్ లీక్ అయింది..!
Oppo Reno 14: ఒప్పో ఇటీవల దేశంలో ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రోలను విడుదల చేసింది. ఇప్పుడు బ్రాండ్ తదుపరి రెనో సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 14 పై పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లీకైన సమాచారం ప్రకారం, రెనో 14 సిరీస్ స్లిమ్, తేలికైన డిజైన్‌తో, మెటల్ మిడ్-ఫ్రేమ్‌తో వస్తుంది. ఇంతలోఒప్పో రెనో 14 కొన్ని అధికారిక ఫోటోలను షేర్ చేసింది. దాని డిజైన్ ఐఫోన్ మాదిరిగానే కనిపిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Oppo Reno 14: కింగ్ వస్తున్నాడు.. ఒప్పో నుంచి ఐఫోన్ లాంటి మొబైల్.. ఫీచర్స్, డిజైన్ లీక్ అయింది..!
Oppo Reno 14 Design
ఇంతకుముందు లీకైన రెనో 14 ప్రో మోడల్ రెండర్ ఒప్పో రెనో 13 ప్రో మాదిరిగానే డిజైన్‌ను చూపించింది. ఇప్పుడు వీబోలో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా షేర్ చేసిన రెండు కొత్త ఫోటోలు రెనో 14 సాధ్యమైన డిజైన్ కూడా తెలుసుకోవచ్చు.
Oppo Reno 14 Camera
మొదటి ఫోటోలో ఫోన్ వెనుక ప్యానెల్, కెమెరా మాడ్యూల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫోన్ పైభాగంలో ఫ్లాట్ వైట్ ఫినిషింగ్ ఉంది, కెమెరాలు R-ఆకారంలో ఉన్నాయి - రెండు ఎడమవైపున, మూడవది క్యాప్సూల్ ఆకారపు రింగ్‌లో ఉన్నాయి. దిగువన రెక్టాంగిల్ కెమెరా మాడ్యూల్‌లో ట్రిపుల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
దాని మెటల్ కెమెరా రింగ్, స్మూత్ చాంఫెర్డ్ అంచుల డిజైన్ ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్ మోడళ్లను గుర్తుకు తెస్తుంది. ఒప్పో ఇక్కడ ఫ్లాట్, వన్-పీస్ గ్లాస్ రియర్ ప్యానెల్‌ను ఎంచుకుంది, ఇది కెమెరా మాడ్యూల్ చుట్టూ కొద్దిగా పైకి లేచి కనిపిస్తుంది.
Oppo Reno 14 Buttons
రెండవ ఫోటో సైడ్ వ్యూను చూపిస్తుంది. వాల్యూమ్, పవర్/అన్‌లాక్ బటన్లు ఒకే వైపున ఉన్నాయి. ఫోన్ సైడ్ ప్రొఫైల్ చాలా సన్నగా ఉన్నట్లు చూపిస్తుంది, ఇది తేలికైన, సన్నని డిజైన్‌ను కలిగి ఉందని గతంలో వచ్చిన నివేదికలను ధృవీకరిస్తుంది.
రెనో 14 ప్రో మోడల్‌లో మ్యాజిక్ క్యూబ్ బటన్ ఉంటుందని మునుపటి నివేదికలు సూచించినప్పటికీ, బేస్ రెనో 14 మోడల్‌లో ఈ బటన్ ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఒప్పో రెనో 13, రెనో 13 ప్రో స్మార్ట్‌ఫోన్లు మెటల్ (అల్యూమినియం) మిడ్-ఫ్రేమ్ బిల్డ్‌తో లాంచ్ అయ్యాయి.