OnePlus Nord 4 5G Price Drop: మరి ఇంత తగ్గింపా?.. వన్‌ప్లస్ నార్డ్ 4 5జీపై భారీ డిస్కౌంట్..!
OnePlus Nord 4 5G Price Drop: మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ 30000 కంటే తక్కువగా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
OnePlus Nord 4 5G Price Drop: మరి ఇంత తగ్గింపా?.. వన్‌ప్లస్ నార్డ్ 4 5జీపై భారీ డిస్కౌంట్..!
OnePlus Nord 4 5G Price Drop: మీరు కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ 30000 కంటే తక్కువగా ఉందా? అయితే మీకో గుడ్ న్యూస్. OnePlus Nord 4 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌ను మునుపటి కంటే మరింత సరసమైనదిగా చేసింది. అమెజాన్‌లో నడుస్తున్న బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా వన్‌ప్లస్ నార్డ్ 4 5జీని కేవలం రూ. 25,999కి ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ ధర, డిస్కౌంట్స్, ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
OnePlus Nord 4 5G Offers
వన్‌ప్లస్ నార్డ్ 4 5జీ 256GB వేరియంట్ ధర రూ. 32,999, కానీ అమెజాన్ 9శాతం డిస్కౌంట్ ఇస్తుంది. తగ్గింపు తర్వాత ఫోన్ రూ. 29,999కి అందుబాటులో ఉంది. దీనితో పాటు, కంపెనీ ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తుంది. ఈ ఆఫర్లన్నింటి తర్వాత ఫోన్ ధర బాగా తగ్గుతుంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై మాత్రమే బ్యాంక్ ఆఫర్ అదనపు తగ్గింపును ఇస్తుంది. రూ. 22,800 వరకు డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు.
OnePlus Nord 4 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.74-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.అలానే ఇందులో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్/128జీబీ, 12జీబీ ర్యామ్/256జీబీ, 16జీబీ ర్యామ్/512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం 50MP మెయిన్ + 8MP అల్ట్రా-వైడ్, 16MP సెల్ఫీ కెమెరా ఉంది. పవర్ కోసం 5500mAh బ్యాటరీ అందించారు. ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.