OnePlus Nord 3: వచ్చేస్తోంది.. వన్ ప్లస్ నార్డ్ 3.. ధర ఎంతంటే?

OnePlus Nord 3: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ OnePlus ఇటీవలే కొత్త Nord సిరీస్ ఫోన్‌ను విడుదల చేసింది.

Update: 2023-04-14 15:30 GMT

OnePlus Nord 3: వచ్చేస్తోంది.. వన్ ప్లస్ నార్డ్ 3.. ధర ఎంతంటే?

OnePlus Nord 3: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ OnePlus ఇటీవలే కొత్త Nord సిరీస్ ఫోన్‌ను విడుదల చేసింది. OnePlus Nord CE 3 Lite 5Gని కొనుగోలు దారులకు పరిచయం చేసింది. త్వరలో Nord సిరీస్ లో భాగంగా మరో కొత్త ఫోన్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫోన్ విడుదల, స్పెసిఫికేషన్, ధర వంటి ఇతర వివరాల గురించి కంపెనీ ప్రకటించ లేదు. అయినప్పటికీ ఈ కొత్త ఫోన్ గురించి కొన్ని లీకులు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం..

వన్ ప్లస్ నార్డ్ 3 విడుదల

టెక్ బ్లాగర్ యోగేష్ బ్రార్ త్వరలో విడుదలకు సిద్ధమైన వన్ ప్లస్ నార్డ్ 3 స్పెసిఫికేషన్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేశారు. వన్ ప్లస్ నార్డ్ 3 5జీని భారత్ మార్కెట్లో వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో విక్రయించనున్నట్లు తెలిపారు. దీని అర్థం Nord 3 మే లేదా జూన్ లో మార్కెట్ లో విడుదల కానుంది.

వన్ ప్లస్ నార్డ్ 3 ధర రూ. 30,000 నుంచి రూ. 40,000 మధ్య ఉండనుంది. ప్రస్తుతం నార్డ్ 2టీ 5జీ ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం ఆఫర్‌గా ఉంది. 8జీబీ ర్యామ్.. 128జీబీ స్టోరేజ్‌తో బేస్ మోడల్‌కు ప్రారంభ ధర రూ.28,999,12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది.

స్పెసిఫికేషన్‌లు

టిప్‌స్టర్ నార్డ్ 3 5జీకి చెందిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు. వన్ ప్లస్ ఏసీఈ 2వీ రీబ్రాండెడ్ వెర్షన్ లో ఉన్న ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీని కలిగి ఉంది. ఇది అక్కడ ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్ఓసీలలో ఇది ఒకటి.

5000ఎంఏహెచ్ బ్యాటరీ, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ , ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. 64ఎంపీ మెయిన్ కెమెరా 8ఏఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటాయి. కానీ భారతదేశంలో 12జీబీ ర్యామ్ 256జీబీ నిల్వతో ఫోన్ లాంచ్ కానుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 13 బాక్స్ వెలుపల రన్ అవుతుందని, ఓఎక్స్ వై జెన్ ఓఎస్ 13.1ని కలిగి ఉంటుంది.

Tags:    

Similar News