OnePlus 13R 5G Offers: దీపావళి ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
టెక్ దిగ్గజం వన్‌ప్లస్ దీపావళికి రెండు రోజుల ముందు తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది.
OnePlus 13R 5G Offers: దీపావళి ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
OnePlus 13R 5G Offers: టెక్ దిగ్గజం వన్‌ప్లస్ దీపావళికి రెండు రోజుల ముందు తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. కంపెనీ ఫేమస్ AI స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సేల్‌లో వన్‌ప్లస్ 13 సిరీస్ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్పెషల్ సేల్ అక్టోబర్ 17, 2025న ప్రారంభమైంది.
ఈ ఫోన్‌లను వన్‌ప్లస్ వెబ్‌సైట్, అమెజాన్, క్రోమా, విజయ్ సేల్స్‌తో పాటు ఇతర స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయచ్చు. అయితే ఇప్పుడు OnePlus 13R 5G ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ వన్‌ప్లస్ ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.44,999కి విడుదలైంది. అమెజాన్ దీపావళి సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 13శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత రూ.37,999కి మొబైల్‌ను ఆర్డర్ చేయచ్చు.
బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే, ఈ ఫోన్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఈఎమ్ఐపై రూ.2,250 తగ్గింపుతో లభిస్తుంది. అదనంగా ఈ హ్యాండ్‌సెట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో కూడా అందుబాటులో ఉంది. ఎక్స్‌ఛేంజ్ డీల్ అనేది బ్రాండ్, కండిషన్ ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,333 నో-కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికతో కూడా కొనుగోలు చేయచ్చు.
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.78-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 4500 నిట్స్ వరకు ఉంటుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15పై పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP, సెకండరీ కెమెరా 50MP,మూడవ కెమెరా 8MP. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ బ్యాకప్ కోసం ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh పెద్ద బ్యాటరీని ప్యాక్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.