OnePlus Ace 5 Series Launch: ఇండియాలో చూడలేం..వన్‌ప్లస్ రెండు స్మార్ట్‌ఫోన్లు.. ఇవి చాలా స్పెషల్..!
OnePlus Ace 5 Series Launch: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన రెండు కొత్త శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా, వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్‌లను తన దేశీయ మార్కెట్ చైనాలో విడుదల చేసింది.
OnePlus Ace 5 Series Launch: ఇండియాలో చూడలేం..వన్‌ప్లస్ రెండు స్మార్ట్‌ఫోన్లు.. ఇవి చాలా స్పెషల్..!
OnePlus Ace 5 Series Launch: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన రెండు కొత్త శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లు వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రా, వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్‌లను తన దేశీయ మార్కెట్ చైనాలో విడుదల చేసింది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పై నడుస్తాయి. హీట్ కంట్రోల్ చేయడానికి "గ్లేసియర్" కూలింగ్ సిస్టమ్‌తో వస్తాయి. రెండింటిలోనూ ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్లు 100W వరకు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, శక్తివంతమైన బ్యాటరీలతోఉంటాయి, ఇవి నిమిషాల్లో ఛార్జ్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
OnePlus Ace 5 Ultra Features
వన్‌ప్లస్ ఏస్ 5 అల్ట్రాలో 6.83-అంగుళాల 1.5K ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ డాల్బీ విజన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 3ఎన్ఎమ్ ఆధారిత మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్, 16GB వరకు ర్యామ్, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ను పొందుతుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇందులో 50MP సోనీ IMX906 OIS ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఇతర ఫీచర్స్‌లో ఫెంగ్చి గేమింగ్ చిప్, లింగ్సీ"టచ్ చిప్, G1 ఇ-స్పోర్ట్స్ Wi-Fi చిప్, గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6,700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అలాగే వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సి, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్రీజ్ బ్లూ, బర్నింగ్ టైటానియం, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
OnePlus Ace 5 Ultra Price
12GB+256GB: CNY 2,499 -సుమారు రూ. 29,700
16GB+256GB: CNY 2,799 -సుమారు రూ. 33,200
12GB+512GB: CNY 2,999 -సుమారు రూ. 35,600
16GB+512GB: CNY 3,299 -సుమారు రూ. 39,200
16GB+1TB: CNY 3,799 -సుమారు రూ. 45,100
OnePlus Ace 5 Racing Edition Features
వన్‌ప్లస్ ఏస్ 5 రేసింగ్ ఎడిషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కొంచెం చిన్న 6.77-అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదలైంది. ఇది 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400e ప్రాసెసర్‌పై నడుస్తుంది.16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో అదే 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో ఫెంగ్చి గేమింగ్ చిప్, గ్లేసియర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ 7,100mAh, ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. చేజింగ్ వేవ్స్ వైట్, రాక్ బ్లాక్, వైల్డ్ గ్రీన్ కలర్ ఎంపికలు ఉన్నాయి.
OnePlus Ace 5 Racing Editions Price
12GB+256GB: CNY 1,799 -సుమారు రూ. 21,400
16GB+256GB: CNY 2,099 -సుమారు రూ. 24,900
12GB+512GB: CNY 2,299 -సుమారు రూ. 27,300
16GB+512GB: CNY 2,499 -సుమారు రూ. 29,700