OnePlus 12 Price Drop: త్వరపడండి.. వన్‌ప్లస్ 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ అదిరిపోయే ఆఫర్..!

OnePlus 12 Price Drop: వన్‌ప్లస్ 12 5G లాంచ్ అయినప్పటి నుండి దాని ధరలో ఇదే అతిపెద్ద తగ్గింపు ప్రకటించింది. వన్‌ప్లస్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ప్రారంభంలో విడుదల చేశారు.

Update: 2025-07-27 08:46 GMT

OnePlus 12 Price Drop: త్వరపడండి.. వన్‌ప్లస్ 12 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ అదిరిపోయే ఆఫర్..!

OnePlus 12 Price Drop: వన్‌ప్లస్ 12 5G లాంచ్ అయినప్పటి నుండి దాని ధరలో ఇదే అతిపెద్ద తగ్గింపు ప్రకటించింది. వన్‌ప్లస్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ప్రారంభంలో విడుదల చేశారు. 16జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో OnePlus 12 పై అకస్మాత్తుగా ధర తగ్గింపు జరిగింది. వన్‌‌ప్లస్ 13 లాంచ్ తర్వాత, ఈ ఫోన్ ధర నిరంతరం తగ్గుతోంది.

OnePlus 12 Offers

16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ కలిగిన OnePlus 12 5G వేరియంట్ అమెజాన్‌లో రూ.56,998కి జాబితా చేశారు. దీని ధర రూ.69,999. ఆ కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ధరను రూ.13,000 తగ్గించింది. దీనితో పాటు, రూ. 4,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, రూ. 6,000 అదనపు డిస్కౌంట్ అందిస్తున్నారు. మొత్తంమీద, దీనిని రూ.46,998కి ఇంటికి తీసుకురావచ్చు, ఇది లాంచ్ ధర కంటే దాదాపు రూ.23,000 తక్కువ. వన్‌ప్లస్ 12 5జీని ఎమరాల్డ్, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

OnePlus 12 5G Features

ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో 6.82-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో కంపెనీ QHD+ రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించింది. దీని పీక్ బ్రైట్నెస్ 4,500 నిట్స్. దీని రక్షణ కోసం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ ఇస్తుంది.

వన్‌ప్లస్ 12లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన 5,400mAh బ్యాటరీ ఉంది, ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14 పై పనిచేస్తుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. దీనికి 50మెగాపిక్సెల్ ప్రైమరీ టెలిఫోటో, 64మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిస్కోప్, 48మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Tags:    

Similar News