Nothing Phone 3a Series: అద్భుతం.. మహా అద్భుతం.. నథింగ్ నుంచి కొత్త ఫోన్లు వస్తున్నాయ్..!

Nothing Phone 3a Series: టెక్ కంపెనీ నథింగ్ మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా 3ఏ సిరీస్‌ను పరిచయం చేయనుంది.

Update: 2025-02-23 10:24 GMT

Nothing Phone 3a Series: టెక్ కంపెనీ నథింగ్ మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా 3ఏ సిరీస్‌ను పరిచయం చేయనుంది. ఈ సిరీస్‌లో ఫోన్ 3ఏ, 3ఉఏ ప్రో అనే రెండు వేరియంట్‌లు ఉంటాయి. రెండు డివైజెస్‌‌లో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది. ఈ ఫీచర్ మునుపటి మోడల్‌ల వలె 'మెరిసే ఫోన్'గా చేస్తుంది. దీనితో పాటు, ట్రాన్స్‌పాంట్ డిజైన్, కొన్ని కెమెరా మాడ్యూల్స్‌లో మార్పులను ఫోన్‌లో చూడచ్చు. తాజాగా ఫోన్ 3ఎ, ఫోన్ 3ఎ ప్రో రెండర్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. 3ఎ, 3ఎ ప్రోలో కెమెరా మాడ్యూల్ మారవచ్చు. రెండు ఫోన్‌లలో ఎలాంటి ప్రత్యేకతలను చూడవచ్చో తెలుసుకుందాం.

నథింగ్ ఫోన్ 3ఏ రెండు లెన్స్‌లతో పిక్సెల్ లాంటి కెమెరా మాడ్యూల్‌ను ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 3ఏ ప్రో, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు ప్రత్యేకమైన కెమెరా బంప్‌ ఉంది. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ రెండింటిలోనూ అలాగే ఉంటుంది. అయితే ఎడ్జెస్‌లో కొన్ని మార్పులు చేయచ్చు. ఈసారి మరింత గుండ్రంగా ఉంటాయి.

నథింగ్ ఫోన్ 3ఏ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల FHD+ AMOLED ప్యానెల్‌ ఉండనుంది. డిస్‌ప్లేకి పాండా గ్లాస్ ప్రొటక్షన్ అందించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఉండచ్చు. ఇది మాత్రమే కాదు, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని చూడచ్చు. ఫోన్‌కి IP64 సర్టిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ 3ఏ ధర దాదాపు రూ.25,000గా ఉండవచ్చని అంచనా.

నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో 120Hz రిఫ్రెష్‌తో 6.77-అంగుళాల OLED ప్యానెల్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్‌లో 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఫోన్‌లో 50MP పెరిస్కోప్ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. 3ఏ ప్రో ధర రూ.30 వేలు ఉండవచ్చు.

Tags:    

Similar News