Nothing Phone 3 Launched: అద్భుతంగా నథింగ్ ఫోన్ 3.. ఈ ఫోన్ ఐఫోన్ 16 కంటే ఖరీదైనది.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

Nothing Phone 3 Launched: భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్‌లోకి నథింగ్ ఫోన్ 3 విడుదలైంది.

Update: 2025-07-02 08:00 GMT

Nothing Phone 3 Launched: అద్భుతంగా నథింగ్ ఫోన్ 3.. ఈ ఫోన్ ఐఫోన్ 16 కంటే ఖరీదైనది.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

Nothing Phone 3 Launched: భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్‌లోకి నథింగ్ ఫోన్ 3 విడుదలైంది. ఇప్పటివరకు ఆ కంపెనీ విడుదల చేసిన అత్యంత ఖరీదైన ఫోన్ ఇదే. దీని ధర iPhone 16, Samsung Galaxy S25 కంటే ఎక్కువ. చాలా కాలం వేచి ఉన్న తర్వాత కంపెనీ ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 2022లో ముందుగా, నథింగ్ ఫోన్ 2 ప్రారంభించింది, ఇది దాదాపు సగం ధరకే అందించారు. లండన్‌కు చెందిన ఈ బ్రాండ్ ఫోన్ ఎందుకు అంత ఖరీదైనదో తెలుసుకుందాం.

Nothing Phone 3 Price

నథింగ్ ఫోన్ 3 రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది - 12GB RAM + 256GB, 16GB RAM + 512GB. దీని ప్రారంభ ధర రూ.79,999. అదే సమయంలో, దాని టాప్ వేరియంట్ రూ. 89,999 కి వస్తుంది. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900 కు లాంచ్ అయింది.

ప్రస్తుతం, ఐఫోన్ 16 ను రూ. 70,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 3 రెండు రంగులలో ప్రవేశపెట్టారు- బ్లాక్, వైట్ . జూలై 4 నుండి ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుండి దీనిని ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ప్రీ-ఆర్డర్‌పై, వినియోగదారులు HDFC బ్యాంక్ కార్డులపై రూ. 5,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందుతారు.

Nothing Phone 3 Features

నథింగ్ నుండి వచ్చిన ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ అందించారు. ఇది 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఫోన్ 3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లాగా పనిచేస్తుంది. దీనికి 16GB RAM+ 512GB వరకు స్టోరేజ్‌కు సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.5 పై పనిచేస్తుంది. కంపెనీ ఈ ఫోన్ తో 5 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. దీనికి 50MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP కెమెరా కూడా ఉంటుంది.

ఇది 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది, దీనితో 65W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 వంటి రేటింగ్‌లతో వస్తుంది, దీని కారణంగా ఫోన్ నీరు, దుమ్ము మొదలైన వాటిలో పడిపోవడం లేదా మునిగిపోవడం వల్ల దెబ్బతినదు. ఇది ఒక e-SIM , ఫొజికల్ SIM కార్డ్‌కు మద్దతు ఇస్తుంది.

Tags:    

Similar News