New Cyber Crime: మీరు డెలివరీ బాక్సులను అలానే చెత్తలో పడేస్తున్నారా? అయితే జర జాగ్రత్త.. కొత్త ఆన్ లైన్ మోసం వచ్చింది
New Cyber Crime: సాధారణంగా చాలామంది ఆన్‌లైన్ వస్తువులను ఆర్డర్ పెట్టేటప్పుడు వాటితో పాటు కొన్ని బాక్సులు లేదా కవర్లు వస్తాయి.
New Cyber Crime: మీరు డెలివరీ బాక్సులను అలానే చెత్తలో పడేస్తున్నారా? అయితే జర జాగ్రత్త.. కొత్త ఆన్ లైన్ మోసం వచ్చింది
New Cyber Crime: సాధారణంగా చాలామంది ఆన్‌లైన్ వస్తువులను ఆర్డర్ పెట్టేటప్పుడు వాటితో పాటు కొన్ని బాక్సులు లేదా కవర్లు వస్తాయి. అయితే వాటిపై ఉండే మీ అడ్రస్సు, ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఇప్పుడు కొత్త మోసాలు జరుగుతున్నాయి. మోసగాళ్లు మీ సమాచారాన్ని కాజేసి మిమ్మల్ని బుట్టలో పడేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్లను నమ్మితే.. ఇక మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవడం ఖాయం.
ఈ మధ్యకాలంలో షాపులకు వెళ్లి కొనేవాళ్లు తక్కువై పోయారు. ఎక్కువమంది ఇప్పుడు ఆన్ లైన్లలైన్ షాపింగ్‌లో కావాల్సిన వస్తువులను కొనేస్తున్నారు. అయితే ఇంటికి ఎప్పుడైతే డెలివరీ వచ్చిందో అప్పుడు డెలివరీ బాక్సు పైన కవర్ ఉంటుంది. దానిపైన మీ అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. అదేవిధంగా డెలివరీ కోడ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు వాటిని సేకరించిన నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్బడుతున్నారు.
ఏం జరుగుతుంది?
ఆన్ లైన్ ఆర్డర్ బుక్ చేసేముందు కస్టమర్ అడ్రస్, ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఫోన్ నెంబర్‌కు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఆ అడ్రస్‌కు డెలివరీ అవుతుంది. అయితే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే డెలివరీ అయిన తర్వాత ప్యాకింగ్‌ని ఓపెన్ చేసి.. ఆ కవర్‌ని చెత్త బుట్టలో పడేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ అడ్రస్, ఫోన్ నెంబర్లు ఆ బాక్స్‌పైన అలానే ఉండిపోతాయి. ఇలాంటి బాక్సులు లేదా కవర్లను సేకరించిన నేరగాళ్లు, వాటిపై ఉన్న ఫోన్ నెంబర్‌కు సంప్రదిస్తారు. డెలివరీ డీటైల్డ్ చెప్పడంతో నిజంగా వాళ్లు పంపించింది ఆ డెలివరీ నుంచే అని ఎవరైనా భావిస్తారు. కానీ డెలివరీ బాయ్ వాళ్లను డిమాండ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం వంటి మోసాలకు పాల్బడతారు. ఒకవేళ నిజంగా మీరు ఆ మోసంలో గనక కూరుకుపోతే మీ అకౌంట్లలో డబ్బులు ఖాళీ అయిపోతాయి.
ఏం చేయాలి. .
వ్యక్తగత సమాచారాన్ని నాశనం చేయాలి...
డెలివరీ అయిన తర్వాత బాక్సులను లేదా కవర్లను అలాగే పడేయకూడదు. వాటిపై ఉన్న అడ్రస్ , ఫోన్ నెంబర్లు ఎవరూ గుర్తించకుండా వాటిని అంటించి వేయాలి. లేదా వాటిని పూర్తిగా చింపేయాలి.
సురక్షితమైన ప్రాంతాల్లో..
డెలివరీ బాక్సులను బహిరంగ ప్రదేశాల్లో పడేయకూడదు. ఎక్కువ మొత్తంలో చెత్త ఉండే ప్రాంతాలు, సురక్షితమైన ప్రాంతాల్లో మాత్రమే పడేయాలి. లేదంటే అడ్రసు, ఫోన్ నెంబర్లు కనిపించకుండా వాటిని చింపేయాలి.
అన్ నోన్ నెంబర్లు, మెసేజ్‌లతో అప్రమత్తం
అడ్రసు, పోన్ నెంబర్లు తెలుసుకున్న నేరగాళ్లు మీకే స్వయంగా ఫోన్ చేస్తారు. ఆ తర్వాత మీ నెంబర్లతో పలు రకాల మోసాళ్లకు దిగుతారు. ఏదో ఒక విధంగా మీ అకౌంట్లలో డబ్బులను లాక్కుంటారు. అందుకే ఎలాంటి అన్ నోన్ కాల్స్ వచ్చినా మెసేజ్‌లు వచ్చినా దేనికీ స్పందించకూడదు. ఒకవేళ ఎటువంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలి.