Netflix: అమెజాన్ ప్రైమ్ కి షాక్.. భారీగా తగ్గిన "నెట్ ఫ్లిక్స్" ప్లాన్ ధరలు

* మూడు నెలల ప్లాన్ పై 60 శాతం ధరలను తగ్గించిన నెట్ ఫ్లిక్స్

Update: 2021-12-15 07:31 GMT

Netflix: అమెజాన్ ప్రైమ్ కి షాక్.. భారీగా తగ్గిన "నెట్ ఫ్లిక్స్" ప్లాన్ ధరలు (ఫోటో: నెట్ ఫ్లిక్స్)

Netflix: డిసెంబర్ 13వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్లాన్ రూ.129 నుండి రూ.179కి పెంచడంతో పాటు 3 నెలల ప్లాన్ ని రూ.329 నుండి రూ.459.. ఏడాది ప్లాన్ రూ.999 నుండి రూ.1,499కు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ కి షాక్ ఇస్తూ నెట్ ఫ్లిక్స్ భారీగా ధరలను తగ్గించింది. అంతకు ముందు 199 రూపాయలుగా ఉన్న మొబైల్ నెలవారీ ప్లాన్ 149 రూపాయలకు తగ్గించింది.

ఇక 499 రూపాయలుగా ఉన్న బేసిక్ ప్లాన్ ని 60 శాతం తగ్గిస్తూ కేవలం రూ.199 కే వినియోగదారులకు అందిస్తుంది. ఒకేసారి రెండు డివైస్ లో స్ట్రీమ్ చేసుకోవడంతో పాటు వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌ట్యాప్‌లు, పీసీలు, టీవీల్లో కూడా నెట్‌ఫ్లిక్స్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. అంతేకాకుండా రూ.649 ప్లాన్ ధరను రూ.499 కు తగ్గించారు. ఈ ప్లాన్ ద్వారా కంటెంట్‌ను హెచ్‌డీ లో స్ట్రీమ్ చేసుకోవచ్చు.

4K+HDR లో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకోవడంతో పాటు నాలుగు వేరు వేరు డివైస్‌ లలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసే అవకాశం ఉన్న రూ.799 ప్లాన్ ధరను రూ.649కు తగ్గించారు. నెట్ ఫ్లిక్స్ భారత్ లో సేవలు ప్రారంభించిన సమయం నుండి 60 శాతం వరకు ఇలా ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ ధరలు పెంచిన తరువాత రోజే ఇలా భారీగా తగ్గించడంతో అమెజాన్ ప్రైమ్ కి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

Tags:    

Similar News