Moto G86: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్స్.. ఎలా ఉన్నాయంటే..?

Moto G86: మోటరోలా త్వరలో తన పోర్ట్‌ఫోలియోకు మరో శక్తివంతమైన ఫోన్‌ను జోడించబోతోంది.

Update: 2025-05-12 12:30 GMT

Moto G86: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్స్.. ఎలా ఉన్నాయంటే..?

Moto G86: మోటరోలా త్వరలో తన పోర్ట్‌ఫోలియోకు మరో శక్తివంతమైన ఫోన్‌ను జోడించబోతోంది. ఈ మోటరోలా ఫోన్‌ను మోటో G86 పవర్ పేరుతో లాంచ్ చేయవచ్చు. ఈ మోటరోలా ఫోన్ కలర్ వేరియంట్లు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. ఈ ఫోన్ నాలుగు రంగులలో లభిస్తుంది - లైట్ రెడ్, లావెండర్, ఆలివ్ గ్రీన్, బ్లూ-గ్రే. ఇది కాకుండా ఫోన్ వెనుక ప్యానెల్, కెమెరా డిజైన్ కూడా వెల్లడైంది.

మోటరోలా ఈ బడ్జెట్ ఫోన్ వెనుక భాగంలో ఎకో లెదర్, టెక్స్చర్డ్ ప్లాస్టిక్ ఉపయోగించారు. ఈ ఫోన్ లుక్, డిజైన్ Moto G86 లాగానే ఉంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ చూడచ్చు. ఇది కాకుండా, ఫోన్ వెనుక ప్యానెల్‌లో మోటరోలా లోగో ఇచ్చారు. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో లాంచ్ అవుతుంది.

Moto G86 Display

మోటో G86 పవర్ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ 6.67-అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 120Hz హై రిఫ్రెష్ ఫీచర్‌కు సపోర్ట్ ఇవ్వగలదు. ఫోన్ డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని దీనిలో చూడచ్చు.

Moto G86 Processor

ఈ ఫోన్‌లో కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్‌ను అందించగలదు, దీనిని మీరు అనేక ఇతర మిడ్-బడ్జెట్ ఫోన్‌లలో చూడచ్చు. ఈ మోటరోలా ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వరకు సపోర్ట్ చేయగలదు.

Moto G86 Battery

ఈ మోటరోలా ఫోన్‌లో 6,720mAh శక్తివంతమైన బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 33W యూఎస్‌బి టైప్ C ఫీచర్‌ను అందించవచ్చు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉండనుంది. కంపెనీ రెండేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్‌లను, నాలుగేళ్ల పాటు భద్రతా అప్‌డేట్‌లను అందించగలదు.

Moto G86 Camera

మోటో G86 పవర్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. దీనికి 50మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించవచ్చు.

Tags:    

Similar News