Moto G06 Power: రూ.7,499కే మోటో కొత్త స్మార్ట్‌ఫోన్.. డీల్ అదిరిందిగా..!

Moto G06 Power: మోటరోలా ఇటీవల విడుదల చేసిన 7000mAh బ్యాటరీ ఫోన్ ధర భారీగా తగ్గింది.

Update: 2025-10-18 05:30 GMT

Moto G06 Power: రూ.7,499కే మోటో కొత్త స్మార్ట్‌ఫోన్.. డీల్ అదిరిందిగా..!

Moto G06 Power: మోటరోలా ఇటీవల విడుదల చేసిన 7000mAh బ్యాటరీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మోటరోలా ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.7,500 ప్రారంభ ధరకు కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న దీపావళి సేల్‌లో సందర్భంగా ఈ డిస్కౌంట్ అందిస్తోంది. ఫోన్ ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

మోటరోలా G06 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో విడుదలైంది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.7,499. అదనంగా ఫోన్ కొనుగోలుపై రూ.300 ఆదా చేయవచ్చు. ఈ ఫోన్‌ను రూ.7,199 ప్రారంభ ధరకు కొనుగోలు చేయచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఈ మోటరోలా ఫోన్ కొనుగోలుపై రూ.5,450 డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ తగ్గింపు పాత ఫోన్ క్వాలిటీ, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఈ మోటరోలా ఫోన్ 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ బడ్జెట్ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హెలియో UIపై పనిచేస్తుంది. ఈ మోటరోలా ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో శక్తివంతమైన 7000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, వైఫై, 4G, LTE ఉన్నాయి. ఫోన్ వెనుక 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఈ బడ్జెట్ మోటరోలా ఫోన్‌తో పాటు, మోటరోలా ఎడ్జ్ 60 సిరీస్ ఫోన్‌లను కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్‌లోని అన్ని ఫోన్‌లను వేల రూపాయల విలువైన బ్యాంక్ ఆఫర్‌లతో అందిస్తున్నారు. ఫోన్‌ ధరలపై కూడా భారీ తగ్గింపులు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News