Next Generation Windows: జూన్ 24న 'నెక్స్ట్ జనరేషన్‌ విండోస్‌' లాంఛ్

Next Generation Windows: మైక్రోసాఫ్ట్ తరువాతి తరంవిండోస్ ఓఎస్‌ను జూన్ 24న లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-06-03 09:15 GMT

నెక్ట్ జనరేషన్‌ విండోస్‌ (ఫొటో ట్విట్టర్)

Next Generation Windows: మైక్రోసాఫ్ట్ తరువాతి తరం(Next-generation) విండోస్ ఓఎస్‌ను జూన్ 24న లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 'బిల్డ్ 2021(Build 2021)' పేరుతో నిర్వహించే ఈ వర్చువల్ ఈవెంట్‌ లో నెక్స్ట్ జనరేషన్‌ విండోస్ ఓఎస్‌ ను విడుదల చేయనుంది. ఈమేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో ఇప్పటికే ఈ కొత్త ఓఎస్‌ను అన్ని రకాలుగా పరీక్షించారని టాక్ వినిపిస్తోంది. ఈ ఓఎస్ డెవలపర్లు, క్రియోటర్లకు ఉపయోగపడేలా రూపొందించారని సమాచారం. ఈనెల చివర్లో నిర్వహించే కార్యక్రమంలో తరువాతి తరం విండోస్‌ ఫీచర్లను వివరించనున్నారు. ఈ అప్‌డేట్‌ను ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్‌గా 'ప్రాజెక్ట్ సన్ వ్యాలీ(Project Sun Valley)' అని పిలుస్తున్నట్లు ఇదివరకే పలు రిపోర్టులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కొత్త అప్‌డేట్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్‌(UI) మొత్తం మారనున్నట్లు అలాగే విండోస్‌ యాప్‌ స్టోర్ డిజైన్‌ కూడా మారుతున్నట్లు తెలుస్తోంది.

బిల్డ్‌ 2021 ఈవెంట్‌కు సంబంధించి అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం రెడ్‌మండ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. జూన్ 24 న ఉదయం 11 గంటలకు (అమెరికా కాలమాణ ప్రకారం) (ఇండియాలో రాత్రి 8.30 నిమిషాలకు) ఈ ఈవెంట్ జరగనుందని పేర్కొంది. ఈమేరకు మైక్రోసాఫ్ట్ విండోస్ ట్విట్టర్లో 'తదుపరి విండోస్ కోసం' అని ట్వీట్ చేసింది. అయితే విండోస్‌ లోగోలో కూడా కొతం మార్పు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వినియోగదారులు ఈవెంట్ పేజీని సందర్శించి, మైక్రోసాఫ్ట్ నూతన ఆవిష్కరణల కోసం రిమైండర్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చని తెలిపింది.

బిల్డ్‌ 2021 కీనోట్‌లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెల్ల మాట్లాడుతూ, నెక్స్ట్ జనరేషన్‌ విండోస్‌‌ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, గత దశాబ్దంలో విడుదలైన అప్‌డేట్‌లలో చాలా ముఖ్యమైనదిగా ఉండబోతోందని పేర్కొన్నారు. డెవలపర్లకు, క్రియోటర్లకు ఇది చాలా ముఖ్యమైనదని, వారికోసం ఎన్నో ఆర్థిక అవకాశాలను సృష్టించేలా ఉండబోతోందని వెల్లడించారు. తరువాతి తరం విండోస్‌ గురించి తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు.

"ఇది మా వాగ్ధానం. ప్రతీ విండోస్ డెవలపర్‌కు మరింతగా అవకాశాలను మేం సృష్టించబోతున్నాం. అలాగే ఎన్నో కొత్త ఐడియాలను ప్రోత్సహించేందుకు ఇదో ఓపెన్ ప్లాట్‌ఫాంలా ఉపయోగపడేందుకు మోనిటైజ్‌ అప్లికేషన్స్‌ను తీసుకరాబోతున్నాం " అని నాదెళ్ల పేర్కొన్నారు.


Tags:    

Similar News