Windows 10 Latest Version: విండోస్ 10 తాజా వెర్షన్ లో మారనున్న ఐకాన్స్

Windows 10 Latest Version: విండోస్ 10 తాజా వెర్షన్‌లో రీసైకిల్ బిన్, డాక్యుమెంట్ ఫోల్డర్‌, ఇతర ఐకాన్లు మారనున్నాయి.

Update: 2021-03-25 12:30 GMT
మైక్రో‌సాప్ట్ (ఫొటో ట్విట్టర్)

Windows 10 Latest Version: విండోస్ 10 తాజా వెర్షన్‌లో మైక్రోసాఫ్ట్ రీసైకిల్ బిన్, డాక్యుమెంట్ ఫోల్డర్‌ లాంటి ఇతర ఐకాన్స్‌లను మర్చేస్తుందని సమాచారం. అయితే ఇది మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్‌లో పెద్ద మార్పు మాత్రం కాదు. అలాగే తాజా వెర్షన్ ను విండోస్ 10 ఎక్స్ అని పిలవనున్నట్లు సమాచారం.

విండోస్ 10 లోని అత్యంత పాతది, అలాగే ఆకర్షించే వాటిలో ఒకటి ఫైల్ ఎక్స్‌ప్లోరర్ లోని కొన్ని ఐకాన్స్. ఇవి కూడా ప్రస్తుత వెర్షన్ లో మారనున్నాయి. అలాగే ఈ జాబితాలో రీసైకిల్ బిన్, డాక్యుమెంట్ ఫోల్డర్లు, డిస్క్ డ్రైవర్ల కోసం కొత్త ఐకాన్స్ రానున్నాయి. ఈ మేరకు మైక్రోసాప్ట్ బ్లాగ్ లో అమండా లాంగోవ్స్కీ వివరించారు.

గత నెలలో కంపెనీ కొన్ని నూతన విండోస్ 10 సిస్టమ్ ఐకాన్స్‌ను వెల్లడించింది. ఇవి మరింత గుండ్రంగా రూపాంతరం చెంది ఉన్నాయి. ఇవి సెగో ఫ్లూయెంట్ ఐకాన్స్ ఫాంట్‌తో రానున్నాయి. అలాగే టాస్క్‌బార్ విడ్జెట్ కూడా తాజా ఐకాన్స్ తో మారనుంది. గతేగాది మైక్రోసాఫ్ట్ కొన్ని కలర్స్‌ను జోడించి విండోస్ 10 ఐకాన్స్‌ను మార్చింది. ఇది మెయిన్ మెనూని కూడా మార్పు చేసింది.

విండోస్ 10 అప్‌డేట్ గురించి మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ తన డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం అతిపెద్ద అప్‌డేట్ విండోస్ 10 ఎక్స్ ను 2021 మొదటి త్రైమాసికంలో విడుదల చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇది కొంత ఆలస్యం కావొచ్చని, ఈ ఏడాది చివర్లో రావొచ్చని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కాగా, ఈ వార్తలను మైక్రోసాఫ్ట్ ఇంకా ధృవీకరించలేదు. అలాగే విండోస్ 10 ఎక్స్‌ పై కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

Tags:    

Similar News